ఆగస్టు నెలలో జీమెయిల్‌ను గూగుల్ షట్ డౌన్ చేయనుందన్న పుకార్లపై క్లారిటీ ఇచ్చింది గూగుల్.. ఈ-మెయిల్ సేవలను అందిస్తున్న జీమెయిల్‌ను మూసివేయడం లేదని శుక్రవారం తెలిపింది.
న్యూయార్క్: ఆగస్టు నెలలో జీమెయిల్ ను గూగుల్ షట్ డౌన్ చేయనుందన్న వదంతులపై గూగుల్ క్లారిటీ ఇచ్చింది. Gmailను నిషేధిస్తున్నట్లు గూగుల్ యూజర్లకు మెయిల్ చేసిన నకిలీ స్క్రీన్ షాట్ ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ జీమెయిల్‌ను షట్ డౌన్ చేస్తోంది. ఇకపై ఆ సర్వీస్‌ను అందించడం లేదని భారీ పుకార్లు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని గూగుల్ స్వయంగా తెలిపింది.
వైరల్ అయిన నకిలీ స్క్రీన్‌షాట్: 'ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను కనెక్ట్ చేయడానికి, అతుకులు లేని కమ్యూనికేషన్‌ను ఎనేబుల్ చేయడానికి ఇంకా లెక్కలేనన్ని కనెక్షన్‌లను ప్రోత్సహించడానికి Gmail ప్రయాణం ముగుస్తుంది. ఆగస్టు 1, 2024న Gmail అధికారికంగా మూసివేయబడుతుంది. Google Mail నకిలీ స్క్రీన్‌షాట్ ప్రకారం, Gmail ఇకపై ఇమెయిల్‌లను పంపడం, స్వీకరించడం లేదా నిల్వ చేయడం సపోర్ట్ చేయదని దీని అర్థం.
గూగుల్ ఇమెయిల్ సేవను మూసివేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే X (గతంలో ట్విట్టర్) CEO ఎలోన్ మస్క్ X మెయిల్ రాకను ప్రకటించారు. అయితే జీ మెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ రానున్నట్లు తెలుస్తోంది. కానీ Google Gmailని షట్ డౌన్ చేయడం లేదు. మరి ఎక్స్ మెయిల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.