ఈ ఎంఐ బల్బ్ పవర్ 9W, బ్రైట్ నెస్ 105 lumens. ఈ బల్బును రూ.649 ధరతో కొనుగోలు చేయవచ్చు. 16 మిలియన్ రంగులు, 11 సంవత్సరాల లైఫ్ లైఫ్ ఉంటుంది.
నేటి డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ ప్రాడక్ట్స్ అన్నీ స్మార్ట్‌గా మారుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లోకి స్మార్ట్ బల్బులు కూడా వచ్చాయి, మాట్లాడటం ద్వారా వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. స్మార్ట్ బల్బును మీ ఫోన్‌తో కూడా కనెక్ట్ చేయవచ్చు. ఇండియాలో విక్రయిస్తున్న టాప్ 5 స్మార్ట్ బల్బుల గురించి మీకోసం. ఈ స్మార్ట్ బల్బులు అమెజాన్‌లో గొప్ప ఆఫర్‌తో లభిస్తున్నాయి.
ఎంఐ స్మార్ట్ ఎల్‌ఈడి వై-ఫై
ఈ ఎంఐ బల్బ్ పవర్ 9W, బ్రైట్ నెస్ 105 lumens. ఈ బల్బును రూ.649 ధరతో కొనుగోలు చేయవచ్చు. 16 మిలియన్ రంగులు, 11 సంవత్సరాల లైఫ్ లైఫ్ ఉంటుంది. ఈ బల్బ్‌ను Mi Home యాప్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్ iOS ఇంకా Android రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ఈ బల్బును మాట్లాడటం ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్‌లు కూడా బల్బ్‌తో సపోర్ట్ చేస్తాయి.
undefined
హాలోనిక్స్ ప్రైమ్ ప్రిజం
హాలోనిక్స్ ప్రైమ్ ప్రిజం స్మార్ట్ బల్బ్ 12W పవర్ ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.694. ఈ బల్బ్ Wi-Fi అండ్ అమెజాన్ అలెక్సాతో గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని ఫోన్ అండ్ టాబ్లెట్ నుండి కంట్రోల్ చేయవచ్చు. ఈ బల్బ్ అలెక్సాతో హిందీ కామండ్స్ కూడా అర్థం చేసుకుంటుంది. బల్బ్‌తో 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉంది.
ఎంఐ స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్
ఎంఐ స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్ 7.5W పవర్, 108 lumens బ్రైట్ నెస్ తో వస్తుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్‌లు కూడా బల్బ్‌లో సపోర్ట్ చేస్తాయి. ఎంఐ స్మార్ట్ ఎంఐ బల్బ్‌ను ఎంఐ హోం యాప్ నుండి కంట్రోల్ చేయవచ్చు. షియోమీ బల్బ్ లైఫ్ సంబంధించి 15,000 గంటల ఉంటుంది. ఈ బల్బును అమెజాన్ నుంచి రూ.500కు కొనుగోలు చేయవచ్చు.
విప్రో వై-ఫై స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్
ఈ స్మార్ట్ బల్బ్ 9W పవర్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ బల్బ్‌కి అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఇచ్చారు. బల్బ్‌కు కంపటబుల్ మ్యూజిక్ సింక్ సపోర్ట్ ఉంది. బల్బ్ బ్రైట్ నెస్ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇంకా రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది. విప్రో వై-ఫై స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్‌ను అమెజాన్‌లో రూ.635 ధరకు కొనుగోలు చేయవచ్చు.
సిస్క SMW-9W వై-ఫై స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్
సిస్క నుండి వస్తున్న ఈ స్మార్ట్ ఎల్‌ఈడి బల్బ్ 9W పవర్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. బల్బ్‌తో 806 ల్యూమన్‌ల బ్రైట్ నెస్, RGB + 3500K కలర్స్ సపోర్ట్ ఉంది. ఈ బల్బును యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా బల్బ్‌లో సపోర్ట్ చేస్తాయి. సిస్క నుండి ఈ స్మార్ట్ బల్బ్‌ను రూ. 399కి కొనుగోలు చేయవచ్చు, ఇంకా రెండేళ్ల వారంటీ కూడా లభిస్తుంది.