మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ భారత్‌లో విడుదలైంది. అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ మంగళవారం లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ సహా మంచి స్పెసిఫికేషన్లతో బడ్జెట్ రేంజ్‌లోనే ఈ ఫోన్ వచ్చేసింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ భారత్‌లో విడుదలైంది. అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ మంగళవారం లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ సహా మంచి స్పెసిఫికేషన్లతో బడ్జెట్ రేంజ్‌లోనే ఈ ఫోన్ వచ్చేసింది. ముఖ్యంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, మోటో జీ31తో పాటు మరిన్ని బడ్జెట్ ఫోన్‌లకు ఈ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ధర
ఈ మొబైల్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,490గా ఉంది. బ్లాక్, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 లభ్యం కానుంది. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మైక్రోమ్యాక్స్ఇన్ఫో.కామ్ (micromaxinfo.com)లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇక పరిచయ ఆఫర్‌గా తొలిసేల్‌లో రూ.1000 డిస్కౌంట్‌తో రూ.12,490కే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇది పరిమిత కాల ఆఫర్‌గా ఉంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్పెసిఫికేషన్లు
6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. 90హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లతో పాటు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. Micromax In note 2 మొబైల్‌లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్ వెనుక నాలుగు కెమెరాల సెటప్ ఉంది. 48-MP ప్రధాన కెమెరా, 5-MP అల్ట్రా వైడ్ షూటర్, 2-MP మాక్రో షూటర్, 2-MP డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇక వీడియోకాల్స్, సెల్ఫీ కోసం ముందు 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్ సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి. ఇక 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుండగా.. స్టోరేజ్ పొడిగించుకునేందుకు MicroSD కార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్ ఉంది. ఇక లాక్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. Micromax In note 2 మొబైల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా.. 30వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు ఉంది. 25 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని Micromax పేర్కొంది. మొత్తంగా ఈ ఫోన్ 205 గ్రాముల బరువు ఉంటుంది.