క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఐపీఎల్ తో పాటు రాబోయే టీ20 ప్రపంచకప్ వరకు ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇప్పుడు Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ పొందాల్సిందే. అయితే మార్కెట్లోని కొన్ని టెలికాం నెట్ వర్క్ సంస్థలు Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు రాబోయే టీ 20 ప్రపంచకప్ టోర్నీని మిస్ కాకూడదు అనుకుంటున్నారా? అయితే మీరు అందుకోసం కచ్చితంగా Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ పొందాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లోని కొన్ని టెలికాం నెట్ వర్క్.. తమ రీఛార్జ్ ప్లాన్ తోనే Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందజేస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో రీఛార్జ్
undefined
రిలయన్స్ Jio టెలికాం నెట్ వర్క్ కు సంబంధించిన రూ. 151 ప్లాన్ చాలా చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney + Hotstar సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అది కూడా మూడు నెలల పాటు మొబైల్ వర్షెన్ ను ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ లో 8 GB హైస్పీడ్ డేటా వినియోగదారులకు లభిస్తోంది.
ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్
Airtel నెట్ వర్క్ కూడా ఇటీవలే రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. వీటిలో మీకు మూడు నెలల పాటు Disney + Hotstar యాక్సెస్ లభిస్తుంది. రూ. 399 రీఛార్జ్ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు రోజూ 2.5 GB హైస్పీడ్ డేటా వినియోగదారులకు లభిస్తుంది.
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్
Reliance Jio నెట్ వర్క్ కు సంబంధించిన రూ. 783 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు రోజుకు 1.5 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంతే కాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మూడు నెలల పాటు Disney+Hotstar సబ్‌స్క్రిప్షన్ కూడా వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్
ప్రముఖ టెలికాం నెట్ వర్క్ ఎయిర్ టెల్ లో రెండో ప్లాన్ ధర రూ. 839గా ఉంది. ఇది 84 రోజులు వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు రోజుకు 2 GB హైస్పీడ్ డేటా కూడా లభిస్తోంది. ఈ ప్లాన్ మూడు నెలల పాటు Disney + Hotstar యాక్సెస్‌తో కూడా ఉచితంగా వస్తుంది.