Alert:డార్క్‌వెబ్‌లో లీకైన 20 పాస్‌వర్డ్‌ల లిస్ట్, మీరు కూడా వాటిని ఉపయోగిస్తే వెంటనే మార్చుకోండి

By asianet news telugu  |  First Published Mar 4, 2022, 10:26 AM IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అంటున్నారు.చాలా సార్లు ఈ పాస్‌వర్డ్‌ల సహాయంతో హ్యాకర్లు ప్రజల బ్యాంక్ ఖాతాలలోకి కూడా చొరబడవచ్చు. 


మీరు లేక ఎవరైనా సాధారణంగా సోషల్ మీడియా అక్కౌంట్స్ ఇంకా బ్యాంక్ పాస్ వార్డ్స్ కోసం గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటాము. అయితే ఇక్కడే మీరు అతి పెద్ద పొరపాటు చేస్తుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సులభంగా గుర్తుంచుకోగలిగే పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం వల్ల హ్యాకర్ల  మీ ఖాతాలను హ్యాక్ చేయడానికి సులభతరం చేస్తుంది.

మొబైల్ సెక్యూరిటీ సంస్థ లుకౌట్ చాలా సాధారణమైన అలాంటి 20 పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ పాస్‌వర్డ్‌లను ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఈ పాస్‌వర్డ్‌లు  హ్యాకర్స్ ఫోరమ్ డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నాయని భద్రతా సంస్థ నివేదిక పేర్కొంది.

Latest Videos

undefined

సగటున ఒక వ్యక్తి 10 ఖాతాలను నిర్వహిస్తున్నారు
ఒక వినియోగదారు 10 విభిన్న ఆన్‌లైన్ ఖాతాల కోసం పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తారని పాస్‌వర్డ్ మేనేజర్ NordPas నివేదిస్తుంది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు సాధారణ ఇంకా సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. సాధారణ పాస్‌వర్డ్‌ను కలిగి ఉండటం వలన హ్యాకర్లు ప్రజలను సులభంగా బాధితులుగా చేసి వారి డివైజ్ హ్యాక్ చేయవచ్చు.

చాలా సార్లు ఈ పాస్‌వర్డ్‌ల సహాయంతో హ్యాకర్లు ప్రజల బ్యాంక్ ఖాతాలలోకి కూడా చొరబడవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అంటున్నారు.

యుఎస్ బ్యాంకులు త్వరలో తమను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక లాభాపేక్ష లేని సంస్థ నివేదిక ప్రకారం,  యూ‌ఎస్ లో గత సంవత్సరం 1,862 సైబర్ ఉల్లంఘనలు జరిగాయి, ఇది 2020 కంటే 68% ఎక్కువ.

లుకౌట్ మొబైల్ డివైజెస్ కోసం క్లౌడ్ సెక్యూరిటి సేవను అందిస్తుంది. డిసెంబర్‌లో సగటున 80% యూజర్ల ఇమెయిల్‌లు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని Lookout తన బ్లాగ్‌లో పేర్కొంది. లీకైన ఈ-మెయిల్‌తో పాటు కొన్ని ఖాతాల పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయ్యాయి.

డార్క్‌వెబ్‌లో  సాధారణంగా ఉపయోగించిన  20 పాస్‌వర్డ్‌లు
123456
123456789
qwerty 
password
12345
12345678
111111
1234567
123123
Qwerty123
1q2w3e
1234567890
default
000000
Abc123
654321
123321
Qwertyuiop
iloveyou
666666
మీరు కూడా ఈ పాస్‌వర్డ్‌లలో దేనినైనా ఉపయోగిస్తుంటే మీ ఖాతా సురక్షితం కాదు వెంటనే మీ పాస్‌వర్డ్ మార్చుకోవడం ఉత్తమం.

click me!