దేశంలోని ప్రముఖ టెలికం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన Airtel సహకారంతో Poco ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెల మార్చిలో ఇండియాలో లాంచ్ చేసిన Poco C61 కొత్త వెర్షన్, డిస్కౌంట్ & Airtel డేటా ఆఫర్‌తో ముందుకొచ్చింది.
ముంబై: రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ టారిఫ్ పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో Airtel Poco స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఒకదానిపై ఫ్రీ డేటాను ప్రకటించింది. ఈ స్పెషల్ ఎడిషన్ Poco C61 స్మార్ట్‌ఫోన్‌ను కొన్నవారికి Airtel నుంచి 50GB ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది. దీంతో పాటు Poco ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
దేశంలోని ప్రముఖ టెలికం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన Airtel సహకారంతో Poco ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెల మార్చిలో ఇండియాలో లాంచ్ చేసిన Poco C61 కొత్త వెర్షన్, డిస్కౌంట్ & Airtel డేటా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ మోడల్ పేరు 'Poco C61 Airtel ఎక్స్‌క్లూజివ్ వేరియంట్'. రూ.8,999 ధర కలిగిన బేస్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.3,000 తగ్గింపుతో రూ.5,999కి కొనవచ్చు. Oppo C61 బేస్ మోడల్ స్మార్ట్‌ఫోన్ 4GB ఇంటర్నల్ మెమరీ, 64GB స్టోరేజ్‌తో జూలై 17 నుండి మూడు కలర్ వేరియంట్‌లలో ఫ్లిప్‌కార్ట్ నుండి కొనవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్‌ను కొంటె మీకు 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ Poco C61ని కొన్నవారు ఉచిత 50GB Airtel డేటాను ఆస్వాదించవచ్చు. కానీ Airtel ప్రీపెయిడ్ SIM మాత్రమే కొత్త Poco C61లో 18 నెలల పాటు ఉపయోగించవచ్చు.
ఇంకా స్పెషల్ ఎడిషన్ ఫోన్‌లో పాత Poco C61 మోడల్ కంటే పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. 6.71-అంగుళాల HD డిస్ప్లేతో వస్తున్న Poco C61 Airtel ప్రత్యేక వేరియంట్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఈ ఫోన్ MediaTek G36 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంకా, Android 14 ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. Poco C61 స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మరో ఫీచర్ ఏమిటంటే 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంది.