రూ.99 రీఛార్జ్ చేయడం ద్వారా ఆన్ లిమిటెడ్ డేటాను పొందే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ గురించి మీరు ఇక్కడ సమాచారాన్ని పొందవచ్చు.
మన దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఏంటంటే ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఎక్కువ వాలిడిటీ, డేటా ప్రయోజనాలు, ఆన్ లిమిటెడ్ కాల్స్‌తో ఎయిర్‌టెల్ ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ తీసుకునే వారు ఆన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ఆన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్యాక్‌లో మ్యాక్స్ డేటా లిమిట్ 30జిబి. యూజర్ 30 GB డేటా ఉపయోగించిన తరువాత 64 Kbps స్పీడ్ తో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.
undefined
కానీ, ఈ రూ. 99 డేటా ప్యాక్ యూజర్లకు తప్పనిసరిగా యాక్టివ్ ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ ఉండాలి. ఎయిర్‌టెల్ 5G ప్లస్ లభించే ప్రాంతాలలో వినియోగదారులు ఆన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా 5G డేటాను డైలీ లిమిట్ లేకుండా ఉపయోగించుకోవచ్చు.
అయితే, 5G కవరేజ్ లేని ప్రాంతాల్లోని వినియోగదారులకు కొత్త రూ. 99 డేటా ప్యాక్‌ని పొందవచ్చు. మరోవైపు, వోడాఫోన్ ఐడియా కూడా కస్టమర్లకు స్వాతంత్ర దినోత్సవ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
ఈ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో గరిష్టంగా 50GB డేటాను అందిస్తాయి. ఎయిర్‌టెల్ ఈ రూ.99 ఆన్ లిమిటెడ్ డేటా ప్లాన్ వాలిడిటీ ఒక రోజు మాత్రమే అని గమనించాలి.