మీరు కూడా మీ ఫోన్‌ స్క్రిన్ పై ఇలాంటి ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ చూసారా..? దీని అర్థం ఏంటో తెలుసా ?

By asianet news telugu  |  First Published Aug 17, 2023, 9:36 PM IST

మొబైల్ ఆపరేటర్లు ఇంకా  సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టం ఎమర్జెన్సీ అలర్ట్ ట్రాన్స్‌మిషన్ పనితీరును అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి టెస్టింగ్ ఎప్పటికప్పుడు నిర్వహించబడతాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది.
 


 తాజాగా  చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు 'సివియర్ ఎమర్జెన్సీ అలెర్ట్' పేరుతో ఫ్లాష్ మెసేజ్ పంపబడింది. దేశంలోని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్  పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

"ఇది భారత ప్రభుత్వ సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన సాంపుల్  వార్నింగ్ మెసేజ్. ఈ మెసేజ్ పొందింది వారు రిజెక్ట్  చేయవచ్చు. మెసేజ్ కోసం ఎటువంటి యాక్షన్స్  అవసరం లేదు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఈ మెసేజ్  దేశవ్యాప్తంగా పంపింది. దీనిని ప్రజల భద్రత మెరుగుపర్చడానికి  ఇంకా అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించడం కోసం  ఉద్దేశించబడింది," అని ఫ్లాష్ మెసేజ్ పేర్కొంది.

Latest Videos

undefined

ఈరోజు మధ్యాహ్నం 1.35 గంటలకు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ మెసేజ్ వచ్చింది.

మొబైల్ ఆపరేటర్లు ఇంకా  సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టం ఎమర్జెన్సీ అలర్ట్ ట్రాన్స్‌మిషన్ పనితీరును అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి టెస్టింగ్ ఎప్పటికప్పుడు నిర్వహించబడతాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది.

భూకంపాలు, సునామీలు ఇంకా ఆకస్మిక వరదలు వంటి విపత్తుల సమయంలో మెరుగైన సన్నద్ధత కోసం ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. అంతకుముందు జూలై 20వ తేదీన కూడా ఇదే  టెస్ట్  వార్నింగ్ మెసేజ్ పంపబడింది.

click me!