కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్..! బేసిక్ టారిఫ్ ప్లాన్ ధర 57% పెంపు.. ఇప్పుడు కనీస రీఛార్జ్ ఎంతంటే..

By asianet news teluguFirst Published Jan 25, 2023, 1:29 PM IST
Highlights

బేసిక్ టారిఫ్‌ను దాదాపు 57 శాతం పెంచినట్లు కంపెనీ ప్రతినిధి మంగళవారం తెలిపారు. కంపెనీ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.99కి బదులుగా రూ.155గా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్‌ను నిలిపివేసి, ఏడు సర్కిళ్లలో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. 

ఇండియాలోని రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు పెద్ద షాకిచ్చింది. కంపెనీ బేసిక్ టారిఫ్ ప్లాన్ ధరను 57 శాతం అంటే దాదాపు ఒకటిన్నర రెట్లు పెంచింది. కంపెనీ ఇప్పుడు రూ.99కి బదులుగా రూ.155 ధరతో కొత్త ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అంటే, ఇప్పుడు ఎయిర్‌టెల్ కస్టమర్లు సిమ్‌ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కనీసం రూ.155తో రీఛార్జ్ చేసుకోవాలి. 

బేసిక్ టారిఫ్‌ను దాదాపు 57 శాతం పెంచినట్లు కంపెనీ ప్రతినిధి మంగళవారం తెలిపారు. కంపెనీ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.99కి బదులుగా రూ.155గా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్‌ను నిలిపివేసి, ఏడు సర్కిళ్లలో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. 

ఈ ఏడు సర్కిళ్లలో ఎయిర్‌టెల్ ప్లాన్ ధర 
ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఏడు సర్కిళ్లలో ప్రస్తుత ప్లాన్‌ను నిలిపివేసి ఎయిర్‌టెల్ మెరుగైన ప్లాన్‌ను రూపొందించింది. గత ఏడాది చివరిలో ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో కంపెనీ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

టారిఫ్ ప్లాన్ ధరను ఎందుకు పెంచారు?
టారిఫ్ పెంపు గత ఏడాది ఇండియాలో జరిగిన 5G వేలంలో బిలియన్ల డాలర్లు వెచ్చించిన కంపెనీ దీని ద్వారా ఆదాయాన్ని పెంచుతుందని అంచనా వేయబడింది. సెప్టెంబరు త్రైమాసికంలో Airtel ఆవరేజ్ ఆదాయం ప్రతి వినియోగదారులకు (ARPU) రూ. 190.

కంపెనీ చివరిసారిగా నవంబర్ 2021లో రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ARPU అండ్ ఆదాయాన్ని పెంచడానికి కంపెనీ ఇతర ప్లాన్‌ల ధరలను కూడా పెంచవచ్చు. 

ఎయిర్ టెల్ 155 ప్లాన్‌ 
ఎయిర్ టెల్  కొత్త రూ.155 ప్లాన్‌తో మీకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్లాన్‌తో పాటు 1జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. 28 రోజుల పాటు ప్లాన్‌తో  300 SMSలు లభిస్తాయి. ఈ బెనెఫిట్స్ ఇంతకు ముందు రూ.99 ప్లాన్‌తో ఉండేవి. 

click me!