మీరు 5Gకి అప్‌గ్రేడ్ కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఇంకా మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు మంచి ఛాన్స్. ఈ ఫోన్‌కి 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌లో రూ.25,999 విలువైన ఫోన్‌ను కేవలం రూ.999కే కొనే ఛాన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్‌తో 128జిబి స్టోరేజీని గత ఏడాది మార్చిలో రూ. 25,999 ధరకు ప్రవేశపెట్టారు. ఫ్లిప్‌కార్ట్ సెల్‌లో ఈ ఫోన్‌పై గొప్ప డిస్కౌంట్ ఇస్తుంది. మీరు 5Gకి అప్‌గ్రేడ్ కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఇంకా మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు మంచి ఛాన్స్. ఈ ఫోన్‌కి 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
పోకో ఎక్స్ 4 ప్రొ 5జిపై ఆఫర్‌లు
ఆఫర్ల కంటే ముందు ఈ ఫోన్ ధర గురించి మాట్లాడితే ఫ్లిప్‌కార్ట్ లో పోకో ఎక్స్ 4 ప్రొ 5జి 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999, అయితే ఈ ఫోన్ పై 34 శాతం తగ్గింపు తర్వాత రూ. 14,999కి లిస్ట్ చేయబడింది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999 దీనిని రూ. 16,499కి లిస్ట్ చేయబడింది ఇంకా టాప్ వేరియంట్ 30 శాతం తగ్గింపుతో రూ. 17,999కి లిస్ట్ చేయబడింది. ఫెడరల్ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ లేదా HSBC క్రెడిట్ కార్డ్ ఇంకా EMI లావాదేవీలపై ఫోన్‌తో 10 శాతం (రూ. 750 వరకు) తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లావాదేవీపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
undefined
ఎక్స్ఛేంజ్ ఆఫర్
ఈ ఫోన్‌తో పాటు రూ.17,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. మీరు పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. 25,999 ధర గల ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొంటె మీరు మంచి డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో, ఫోన్ ధర భారీగా తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువ పాత ఫోన్ కంపెనీ అండ్ ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్‌లతో Poco X4 Pro 5Gని రూ.999కే కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు అండ్ కెమెరా
పోకో ఎక్స్ 4 ప్రొ 5జి 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లే, 1200 నిట్‌ల బ్రైట్ నెస్, డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జిబి వరకు LPDDR4x ర్యామ్, 128జిబి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లోని ర్యామ్‌ను 11 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్.
రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో, ముందు భాగంలో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో Wi-Fi, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, కనెక్టివిటీ కోసం ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.