5వ జనరేషన్ లేదా అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5G టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్నవాటితో సహా జూలై 26న ఎయిర్‌వెవ్స్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు నాలుగు అప్లికేషన్‌లతో శుక్రవారం ముగిసింది.
గౌతమ్ అదానీ గ్రూప్ టెలికాం స్పెక్ట్రమ్ కొనుగోలు రేసులో సప్రైస్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది, ఈ ఎంట్రీ నేరుగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ భారతీ మిట్టల్ ఎయిర్‌టెల్‌తో పోటీ పడుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి.
5వ జనరేషన్ లేదా అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5G టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్నవాటితో సహా జూలై 26న ఎయిర్‌వెవ్స్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు నాలుగు అప్లికేషన్‌లతో శుక్రవారం ముగిసింది.
undefined
టెలికాం రంగంలోని మూడు ప్రైవేట్ కంపెనీలు జియో , ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దరఖాస్తు చేసుకున్నాయని ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపాయి.
అయితే నాల్గవ దరఖాస్తుదారి అదానీ గ్రూప్ తాజాగా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (NLD), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ILD) లైసెన్స్ పొందిందని తెలిపాయి. కానీ ఈ విషయం స్వంతంగా ధృవీకరించలేదు.
వేలం ప్రకారం, దరఖాస్తుదారుల ఓనర్ షిప్ వివరాలను జూలై 12న ప్రచురించాలి.
మొత్తం 72,097.85 MHz స్పెక్ట్రమ్ విలువ కనీసం రూ. 4.3 లక్షల కోట్లు వేలం సమయంలో బ్లాక్‌లో ఉంచబడతాయి. అయితే జూలై 26, 2022న వెల్లడిస్తారు.
(600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz), హై (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహించనుంది.
గుజరాత్‌కు చెందిన అంబానీ, అదానీలు ప్రత్యక్షంగా ముఖాముఖి తలపడలేదు.
అంబానీ కూడా సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కోసం గిగా ఫ్యాక్టరీలతో సహా కొత్త ఇంధన వ్యాపారం కోసం మల్టీ-బిలియన్-డాలర్ ప్లాన్‌లను ప్రకటించారు. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించనున్నట్టు గతంలో ప్రకటించిన అదానీ, హైడ్రోజన్ ఆశయాలను కూడా ఆవిష్కరించారు.
ఇక ఇప్పుడు జులై 26న జరిగే 5జీ వేలంలో అదానీ గ్రూప్ పాల్గొంటే ముకేష్ అంబానీకి తొలి ప్రత్యక్ష పోటీ అవుతుంది.
సెక్టార్ రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) సిఫార్సు చేసిన రిజర్వ్ ధరల 5G వేలంపాటలను క్యాబినెట్ గత నెలలో ఆమోదించింది . మొబైల్ సేవల కోసం 5జీ స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఫ్లోర్ ధరలో 39 శాతం కోత విధించాలని రెగ్యులేటర్ సిఫార్సు చేసింది.
స్పెక్ట్రమ్ ఉపయోగించుకునే హక్కు వాలిడిటీ 20 సంవత్సరాలు ఉంటుంది. మొత్తంమీద, రాబోయే వేలంలో బిడ్డర్‌లకు పేమెంట్ నిబంధనలు సడలించబడ్డాయి. మొట్టమొదటిసారిగా, విజయవంతమైన బిడ్డర్లు ముందస్తు చెల్లింపు చేయవలసిన అవసరం లేదు.