బెటర్, ఫాస్టార్, స్ట్రాంగర్: ఎంతోగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ నార్డ్ 2టి వచ్చేసింది.. ఆఫర్ క్లోజెస్ సూన్

By asianet news telugu  |  First Published Jul 4, 2022, 12:43 PM IST

వన్ ప్లస్ నార్డ్ 2టి 5జి 8జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 28,999. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర రూ.33,999. గ్రే షాడో, జాడే ఫాగ్ కలర్‌లో ఈ ఫోన్‌ను జూలై 5 నుండి కొనుగోలు చేయవచ్చు.


వన్ ప్లస్ భారతదేశంలో కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 2టి 5జిని లాంచ్ చేసింది. నార్డ్ 2 5జి లాగానే  వన్ ప్లస్ నార్డ్ 2టి 5జిని 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు, 4500mAh బ్యాటరీ ఇచ్చారు. దీనిలో  MediaTek ప్రాసెసర్‌ లభిస్తుంది.  వన్ ప్లస్ నార్డ్ 2టి 5జి  మోటోరోలా ఎడ్జ్ 30, ఐకూ నియో 6, పోకో ఎఫ్4 5జి, ఎం‌ఐ 11X, స్యామ్సంగ్ గెలాక్సీ A33 5జితో పోటీపడుతుంది.

 ధర
 వన్ ప్లస్ నార్డ్ 2టి 5జి 8జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 28,999. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర రూ.33,999. గ్రే షాడో, జాడే ఫాగ్ కలర్‌లో ఈ ఫోన్‌ను జూలై 5 నుండి కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద ICICI బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌పై రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ జూలై 5-11 వరకు మాత్రమే వాలిడిటీ అవుతుంది.

Latest Videos

undefined

స్పెసిఫికేషన్‌లు
 వన్ ప్లస్ నార్డ్ 2టి 5జిలో ఆండ్రాయిడ్ 12 ఆక్సిజన్ OS 12.1, 6.43-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ ప్లే, డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz దానితో HDR10+కి సపోర్ట్ ఉంటుంది.  గొరిల్లా గ్లాస్ 5  డిస్ ప్లే, MediaTek Helio Dimension 1300 ప్రాసెసర్‌తో 12జి‌బి వరకు LPDDR4X ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్‌తో వస్తుంది.

కెమెరా
వన్ ప్లస్ నార్డ్ 2టి 5జిలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌,  రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్ సెన్సార్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ ఉంది. బ్యాక్ కెమెరా నుండి 4K వీడియో రికార్డింగ్ కూడా  చేయవచ్చు.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం వన్ ప్లస్ నార్డ్ 2టి 5జిలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS / NavIC, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh బ్యాటరీ ప్యాక్ చేస్తుంది. ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది.

click me!