ల్యాప్‌టాప్, మొబైల్, టీవీ కొంటున్నారా.. అయితే ఆగండీ.. భారీ డిస్కౌంట్ మీకోసం..

By Ashok kumar Sandra  |  First Published Jan 6, 2024, 3:48 PM IST

అన్ని ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల షాపింగ్ మేళాలు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు కొంత సమాచారం కూడా విడుదలైంది.
 


షాపింగ్ ప్రియులు ఇప్పుడు ఈ-కామర్స్ కంపెనీల నుండి  నెక్స్ట్  ఆఫర్ సేల్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరి కోసం అమెజాన్ ఆండ్ ఫ్లిప్‌కార్ట్ అన్యువల్ రిపబ్లిక్ డే సేల్స్ మరో పది రోజుల్లో భారీ ఆఫర్‌లతో ప్రారంభం కానుంది. తాజాగా Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024ని ప్రకటించే క్యాంపైన్  వెబ్‌పేజీ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు గణతంత్ర దినోత్సవానికి ముందు జరిగే షాపింగ్ ఫెయిర్‌లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో ఉత్పత్తులు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటిపై భారీ ఆఫర్‌లను అందిస్తాయి. సేల్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ గత సంవత్సరం జనవరి 15 న ప్రారంభమైంది, కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే రోజున ఉంటుందని సూచించింది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సేల్‌కు ముందస్తు ఆక్సెస్‌ను పొందుతారు.

Latest Videos

అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించనుంది. 5G ఫోన్లు రూ.9,999 నుండి అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్ సమాచారాన్ని విడుదల చేసిన పేజీ ప్రకారం కొన్ని స్మార్ట్ ఫోన్‌ల ధర 50,000 రూపాయల వరకు తగ్గవచ్చు.

ల్యాప్‌టాప్‌లపై 75 శాతం వరకు తగ్గింపును ప్రకటించనుంది. స్మార్ట్ టీవీలు ఇంకా  ఇతర పరికరాలు గరిష్టంగా 65 శాతం తగ్గింపుతో లభిస్తాయి. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో పాటు, SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలు కూడా అదనంగా 10% తగ్గింపును పొందుతాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఉత్పత్తుల ధరను మళ్లీ తగ్గించవచ్చు. అమెజాన్ ఆఫర్లపై మరింత సమాచారం రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. అలాగే Flipkart సేల్ సమాచారాన్ని కూడా వెల్లడించవచ్చు. 

click me!