OnePlus Nord CE 2 Lite 5G: వన్‌ప్లస్ నుంచి బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. విడుద‌ల ఎప్పుడంటే..?

By team telugu  |  First Published Apr 17, 2022, 11:39 AM IST

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) దూకుడు పెంచింది. భారత్‌లో ఇటీవలే ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) లాంచ్ చేయగా.. ఇదే నెలలో మరో రెండు మొబైళ్లను విడుదల చేయనుంది. వన్‌ప్లస్‌ చౌకైన ఫోన్‌గా అంచనా వేస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G)తో పాటు వన్‌ప్లస్‌ 10ఆర్ (OnePlus 10R)లను తీసుకురానుంది.


ఆపిల్ ఐఫోన్‌కి ధీటుగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మోడ‌ల్స్‌తో మార్కెట్లోకి వ‌స్తూ.. త‌న‌దైన రీతిలో అభిమానుల‌ను సంపాదించుకుంది వ‌న్‌ప్ల‌స్‌. అయితే ఈ మ‌ధ్య కాలంలో వ‌న్‌ప్ల‌స్ త‌న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వినియోగిస్తున్న ఆక్సిజ‌న్ ఓఎస్ అంటే చాలామంది లైక్ చేసేవాళ్లు, కానీ ఆక్సిజ‌న్ ఓఎస్‌ను క‌ల‌ర్ ఓఎస్‌తో మిక్స్ చేయ‌డాన్ని చాలామంది త‌ప్పుప‌డుతున్నారు. ఇంట‌ర్‌ఫేజ్ అంత ఆక‌ట్టుకునేలా లేద‌ని, ఐకాన్స్ కూడా బాగా లేవ‌ని.. ప‌ర్ఫార్మెన్స్ కూడా ఆక్సిజ‌న్ మాదిరిగా ఉండ‌డం లేద‌ని కంప్లెయింట్ చేస్తున్నారు..

అయితే.. ఈ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నుంచి మ‌రో రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. త‌న స‌రికొత్త నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 28న ఆవిష్క‌రించనున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీని క‌లిగి ఉంటుంది. ఇది 33వాట్స్ సూప‌ర్ వూక్ టెక్నాల‌జీతో అందుబాటులోకి రానుంది. ఇది బ్యాట‌రీని 0 నుంచి 50శాతం వ‌ర‌కు 30 నిమిషాల్లో చార్జ్ చేయ‌గ‌ల‌ద‌ని కంపెనీ పేర్కొంది. కాగా, మిగ‌తా ఫీచ‌ర్ల‌పై కంపెనీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Latest Videos

OnePlus Nord CE 2 Lite 5G హైలెట్స్ (అంచనా)

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 కంటే కాస్త తక్కువస్థాయి స్పెసిఫికేషన్లు, ధరతో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.59 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో OnePlus Nord CE 2 Lite 5G వస్తుందని సమాచారం. ఈ మొబైల్‌ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మరో రెండు కెమెరాలు ఉండనున్నాయి. వన్ ప్లస్ లో చౌకైన మొబైల్ గా ఇది ఉండనుంది. భారత్ మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 20,000 ఉండొచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు అధికారిక ధర వివరాలు ఏప్రిల్ 28న ప్రకటించనుంది సంస్థ‌. OnePlus ఇంకా అధికారికంగా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు.

అంతేకాకుండా ఏప్రిల్ 28న వ‌న్ ప్ల‌స్ మ‌రో ఫోన్‌ను కూడా లాంచ్ చేయ‌నుంది. త‌న స‌రికొత్త 10ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఏప్రిల్ 28న ఆవిష్క‌రించనున్న‌ట్లు ఆ సంస్థ ధ్రువీక‌రించింది. 10 ప్రో 5జీ ఫోన్ విజ‌య‌వంతం త‌ర్వాత వ‌న్‌ప్ల‌స్ ఇప్పుడు 10ఆర్ 5జీ తో ముందుకొచ్చింది. ఈ 10ఆర్ 5జీ ఫోన్ 150 వాట్స్ సూప‌ర్ వూక్ టెక్నాల‌జీ క‌లిగి ఉంటుంది. ఇది చార్జింగ్ పెట్టిన 17 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ అవుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 10 ఆర్ మాత్రం 80 వాట్స్ సూప‌ర్‌వూక్ టెక్నాల‌జీని క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

click me!