జూమ్ యాప్ యూజర్లకు షాక్..ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే సేవలు..

By Sandra Ashok KumarFirst Published Jun 4, 2020, 12:04 PM IST
Highlights

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో త్వరగా పాపులర్ అయిన వీడియో యాప్ ‘జూమ్’ తాజాగా వినియోగదారుల నుంచి సబ్ స్క్రిప్షన్లు కోరుతోంది. తాము అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులతో కలసి పని చేయనున్నందున ఉచితంగా సేవలందించలేమని స్పష్టం చేసింది. 
 

ముంబై: ప్రాణాంతక కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. లాక్‌డౌన్‌ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్‌ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు తెలిపింది.

అయితే తాము టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త అప్‌గ్రేడ్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశామని.. ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడం లేదని, రీచార్జ్‌ చేసుకోవాలని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ తాము త్వరలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌‌బీఐ) అధికారులతో కలిసి పని చేయనున్నామన్నారు. అందువల్లే ఉచితంగా యూజర్లకు సేవలు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు.

యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్‌ యాప్‌  ‘ఎఇఎస్ 256-బీఐటీbit జీసీఎమ్‌ అనే కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. 

also read గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..

ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని జూమ్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్‌ రూమ్స్‌, సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్‌ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్లు అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

అయితే ఇప్పటి వరకు జూమ్‌ యాప్‌ తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందిస్తున్నందున ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి ఎక్కువ స్థాయిలో యూజర్లు ఆసక్తి చూపుతుంటారు.  యూజర్లకు అన్ని కొత్త  వెర్షన్లు రావాలంటే అడ్మిన్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి జూమ్‌ రూమ్స్‌ కంట్రోలర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కంపెనీ సూచించింది. 

మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్‌ చుగ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్‌ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్‌, సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్‌దారు పేర్కొన్నారు.

click me!