ఫేస్‌బుక్ మార్క్ జూకర్ బర్గ్ నిరసనను ఎదుర్కొన్నారు. ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరిగే అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలకు అనుకూలంగా వ్యవహరించినందుకు సొంత సిబ్బందే తీవ్ర నిరసన తెలిపారు. కొందరు సీనియర్ ఉద్యోగులు తమ సంస్థ నుంచి వైదొలిగారు. జాతి వివక్షకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు ‘వీడియో కాన్ఫరెన్స్’లోనే వాకౌట్ చేశారు.
కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టే పోస్టుల పట్ల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ అనుసరిస్తున్న వైఖరిమీద సొంత ఉద్యోగులే అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమైంది.
ఫేస్ బుక్ కంపెనీ ఎప్పుడూ నిర్వహించే ఆల్‌హ్యాండ్స్ సమావేశంలో వారి నుంచి నిరసన వ్యక్తం అయింది. ట్రంప్ పెట్టే కొన్ని పోస్టుల విషయంలో కంపెనీ విధానాలకు విరుద్ధంగా మార్క్ జూకర్ బర్గ్ వ్యవహరిస్తున్నారని ప్రతిరోజూ జరిగే ఆల్ హ్యాండ్స్ ‘వీడియో’ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉద్యోగులు ఆరోపించారు..
మే 25న జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రొ-అమెరికన్ పౌరుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా అంతటా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దోపిడీలు మొదలైతే .. కాల్పులు మొదలవుతాయని ట్రంప్ ఫేస్‌బుక్‌లో పోస్టు ద్వారా ఆందోళనకారులను హెచ్చరించారు.
also read టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?
దోపిడీలు మొదలైతే కాల్పులు ప్రారంభం అవుతాయని పేర్కొంటూ ట్రంప్ చేసిన పోస్ట్ రెచ్చగొట్టేదిగా ఉందంటూ ఫేస్‌బుక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ సందేశం హింసను ప్రేరేపిస్తుందని స్పష్టంగా చెప్పలేమని, సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా లేదని మార్క్ ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. అలాగే ట్రంప్ పోస్టులపై ఎలాంటి చర్యతీసుకోనన్న తన నిర్ణయంలో మార్పులేదని ఆయన ఉద్యోగులకు స్పష్టం చేశారు.
‘రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంలో తప్పక చర్యలు తీసుకుంటానని మార్క్ మాకు చెప్పారు. కానీ, అది ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. విద్వేషాన్ని ఆయుధం వలే వాడుకొనేందుకు సంస్థ సహకరిచింది. చరిత్రకు సరికాని మార్గంలో కంపెనీ నిల్చుంది’ అని తిమోతీ అవెని అనే సంస్థ ఇంజనీర్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అనంతరం ఆయన పదవికి రాజీనామా చేశారు.
అలాగే కొద్ది రోజుల క్రితం మెయిల్ ఇన్ బ్యాలెట్స్‌కు సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్ చేశారు. దానిపై తగిన సమాచారం తెలుసుకోవాలంటూ వినియోగదార్లకు సూచిస్తూ ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను జారీ చేయడం చర్చనీయాంశమైంది. అది అధ్యక్షుడి ఆగ్రహానికి కారణమైంది. ట్రంప్‌పై ట్విటర్ చర్యను ఫేస్‌బుక్ విమర్శించింది. కానీ, ట్విటర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. అలాగే తాజాగా షూట్ చేస్తామంటూ చేసిన వ్యాఖ్య ట్విటర్‌లో కూడా పోస్టు అయింది. ఆ ట్వీట్‌కు కూడా ట్యాగ్‌ను జతచేయడం చేయడం గమనార్హం.