ఫేస్ బుక్ వల్ల మీ ఉద్యోగానికి ఎసరు...జాగ్రత్త...

By Sandra Ashok Kumar  |  First Published Feb 6, 2020, 6:05 PM IST

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలక్షన్ అండ్ అసెస్‌మెంట్‌లో ప్రచురించినా ఒక అధ్యయనంలో మాదకద్రవ్యాల లేదా మద్యపానానికి సూచించే కంటెంట్‌ను పోస్ట్ చేసే ఉద్యోగులను నియమించుకునేవారు చాలా తక్కువ అని అందులో తేలింది.
 


వాషింగ్టన్: మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో  వివాదాస్పద అంశాలపై బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్చడం వంటివి మీకు ఉద్యోగం కల్పించే అవకాశాలను తగ్గించవచ్చు అని ఒక అధ్యయనం చెప్తుంది.

యుఎస్‌లోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జాబ్ రిక్రూటర్లు  సోషల్ మీడియా పోస్టులలో  సొంత విషయాలు కానీ వాటిలో అతిగా  ప్రమేయం కల్గించుకోవడం లేదా మితిమీరి తలదూర్చడం, అభిప్రాయం తెలపడం, వ్యక్తం చేసే  వారికి జాబ్ రిక్రూటర్స్  ఉద్యోగం కల్పించే అవకాశం తక్కువ అని చెప్తున్నారు.

Latest Videos

undefined

also read స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై కరోనా వైరస్ ఎఫెక్ట్...

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలక్షన్ అండ్ అసెస్‌మెంట్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం మాదకద్రవ్యాల లేదా మద్యపానానికి సూచించే కంటెంట్‌ను పోస్ట్ చేసే ఉద్యోగులను నియమించుకునేవారు చాలా తక్కువ అని తేలింది.వారు వివిధ సంస్థల నుండి 436 మంది హైరింగ్ మ్యానేజర్స్ ని నియమించారు. వీరిలో 61 శాతం మంది హాస్పిటాలిటీ పరిశ్రమలో,  మిగిలిన వారు సమాచార సాంకేతిక పరిజ్ఞానం నుండి ఆరోగ్య సంరక్షణ వరకు ఉన్న సంస్థలలో పనిచేస్తున్నారు.

 ఇందులో పాల్గొన్నా హైరింగ్ మ్యానేజర్స్ కి ఉద్యోగ ఇంటర్వ్యూ లో ఇచ్చిన సమాధానాలు వారికి చూపించారు. అప్పుడు వారు వల్ల ఫేస్ బుక్  ప్రొఫైల్స్  చూడాలని ఇంకా వారి ఉపాధి అనుకూలతను రేట్ చేయాలని వారు కోరారు. ఈ అధ్యయనంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి 16 వేర్వేరు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లలో వారు  మగ లేదా ఆడవారు అని తెలుపుతూ ఇంకా వారి అభిప్రాయలు, మద్యం, మాదకద్రవ్యాల వాడకాన్ని చూపించారు.

also read తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు ట్విట్టర్ కొత్త పాలసీ

వారు ఈ ప్రొఫైల్‌లను చదివిన తరువాత  వ్యక్తి-సంస్థకు సరిపోయే అంచనాను, అభ్యర్థుల ఉపాధి అనుకూలతను అంచనా వేశాక అభ్యర్థుల ఉపాధి అనుకూలతపై రిక్రూటర్ల అవగాహనలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.మద్యం, మాదకద్రవ్యాల వాడకాన్ని సూచించే కంటెంట్ ఉద్యోగ నిర్వాహకుల అవగాహనలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయన బృందం కనుగొంది.  

ఉద్యోగ  అన్వేషణలో ఉన్నపుడు  వారి అభిప్రాయలు, మద్యం, మాదకద్రవ్యాల వాడకాన్ని సూచించే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వ్యక్తులు కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా ఉండాలని పరిశోధకులు తేల్చారు.
 

click me!