కరోనా వైరస్ వల్ల స్మార్ట్ ఫోన్ల తయారీపై గణనీయ ప్రభావం చూపుతుందని చిప్ మేకర్ క్వాల్ కామ్ ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై గణనీయంగా పడుతుందని చిప్ మేకర్ క్వాల్ కామ్ తెలిపింది. ఫోన్లను తయారు చేయడంతోపాటు విక్రయాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల తయారీలో క్వాల్ కామ్ సరఫరా చేసే మోడర్న్ ‘చిప్స్’ అత్యధికం. ఈ చిప్స్ లేకుండా స్మార్ట్ ఫోన్లు తయారవుతాయా? అంటే అనుమానమే సుమా. వైర్ లైస్ డేటా నెట్ వర్క్స్, మొబైల్ ఫోన్లను కనెక్ట్ చేయడంలో క్వాల్ కామ్ చిప్ చాలా కీలకం.
క్వాల్ కామ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఆకాశ్ పాల్కీవాలా స్పందిస్తూ హ్యాండ్ సెట్ల డిమాండ్, సప్లయి చైన్‌పై కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా ఉంటుందన్నారు. క్వాల్ కామ్ షేర్లు 3.75 శాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. శాన్ డియాగో కేంద్రంగా పని చేస్తున్న చిప్ సప్లయర్ క్వాల్ కామ్ ఆదాయం అంచనాల కంటే మెరుగ్గానే నమోదైంది.
also read తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు ట్విట్టర్ కొత్త పాలసీ
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు 5జీ నెట్ వర్క్ దిశగా అడుగు పెట్టనున్నాయి. కానీ కరోనా వైరస్ ప్రభావం 5జీ సేవల ప్రారంభం కావడానికి అంతరాయం కలుగుతుందని క్వాల్ కామ్ అంచనా వేసింది. క్వాల్ కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెవ్ మొల్లెన్ కోఫ్ మాట్లాడుతూ చైనా నుంచి డిమాండ్ అంశం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల మార్కెట్ల వైపు ద్రుష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందన్నారు.
ప్రాసెసర్లు, మొబైల్ మోడెంల తయారీలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న క్వాల్ కామ్.. 5జీ నెట్ వర్క్ ఫోన్లలో ఇది మరింత సంక్లిష్టం కానున్నది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఫ్రంట్‌లో వినియోగదారుల మనస్సులను గెలుచుకున్నది. క్వాల్ కామ్ కలిగి ఉన్న 5జీ మొబైల్ హ్యాండ్ సెట్లు 175 నుంచి 225 మిలియన్ల మధ్య ఉంటాయని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొల్లెన్ కోఫ్ అంచనా వేశారు.
also read మేధో సంపత్తిలో భారత్ కన్నా గ్రీస్, రోమినియన్ రిపబ్లిక్ దేశాలు ముందు....
ద్వితీయ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం 4.9 బిలియన్ల నుంచి 5.7 బిలియన్ల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది క్వాల్ కామ్. మొబైల్ ఫోన్ల తయారీదారులకు టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన క్వాల్ కామ్ డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. 5జీ టెక్నాలజీ కోసం 85 లైసెన్సు అగ్రిమెంట్లపై సంతకాలు చేసింది.