ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయిన ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్‌ను ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లపై వస్తోన్న ఆదరణపై దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఒప్పో ఫోల్డబుల్ ఎన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి వివో కూడా వచ్చి చేరనుంది. త్వరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది వివో.
ఏప్రిల్ 11న లాంచ్
మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఏప్రిల్ 11న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వివో ఎక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను కంపెనీ టీజ్ చేసింది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ భారీ స్క్రీన్, బ్యాటరీతో రానున్నుట్లు సమాచారం. దీంతో పాటుగా ఏప్రిల్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌లో.. వివో ప్యాడ్ టాబ్లెట్, Vivo X ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్, Vivo X నోట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ వంటి మూడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
చైనీస్ సోషల్‌మీడియా ప్రకారం..వివో ఎక్స్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. బ్లూ, క్రిమ్సన్, ఆరేంజ్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రానున్నట్లు సమాచారం.