ఇండియాకి మరో గిఫ్ట్ ఇచ్చిన అమెజాన్ సి‌ఈ‌ఓ...

By Sandra Ashok Kumar  |  First Published Jan 20, 2020, 3:40 PM IST

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ట్విట్టర్‌లో ఒక వీడియోతో ఎలక్ట్రిక్-పవర్డ్ డెలివరీ రిక్షాల సౌకర్యాన్ని పరిచయం చేశారు.


భారతదేశంలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పర్యటన అనంతరం అమెరికాకు చేరుకున్న కీలక ప్రకటన చేశారు.ఈ ఉదయం అమెరికన్ బిలియనీర్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ గత వారంలో మూడు రోజుల భారత పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఎలక్ట్రిక్-పవర్డ్ డెలివరీ రిక్షాల రోల్ అవుట్ గురించి ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

ప్రస్తుతానికి  దీనిపై ఎలాంటి  ప్రణాళిక వివరాలు లేనప్పటికీ జెఫ్ బెజోస్ పెప్పీ ప్రోమో వీడియోలో చార్కోల్ ఎలక్ట్రిక్ రిక్షాల్లో ఒకదాన్ని డ్రైవ్ చేశాడు.  అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ శుక్రవారం భారతదేశానికి నుండి వెళ్ళే సమయంలో త్వరలో ఇండియాలో ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చారు.

Latest Videos

undefined

also read హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...

భారత పర్యటన ముగించుకున్న తరువాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరగా వారు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.గత వారం ఆయన భారత పర్యటన సందర్భంగా వందలాది మంది చిన్న వ్యాపారులు నిరసనలు చేపట్టారు. ఈ-కామర్స్ బెహెమోత్ ఇంకా దాని ప్రధాన పోటీ దారి వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ పై యాంటీ ట్రస్ట్  అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


అమెజాన్ 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడతానని బెజోస్ చేసిన ప్రకటనను కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ తోసిపుచ్చారు. బిజెపి సీనియర్ నాయకుడు ది వాషింగ్టన్ పోస్ట్  యాజమాన్యంపై విరుచుకుపడ్డారు."నేను ఇక్కడకు తిరిగి వచ్చిన ప్రతిసారీ నేను భారతదేశంతో ఎక్కువ ప్రేమలో పడ్డాను.

also read నిలిచిన వాట్సాప్‌ సేవలు: కొద్దిసేపు కాలు చేయ్యి ఆడలేదంటే నమ్మండి

భారతీయ ప్రజల అనంతమైన శక్తి, ఆవిష్కరణలు మరియు గ్రిట్ ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాయి" అని మిస్టర్ బెజోస్ శుక్రవారం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన దేశానికి తన వీడ్కోలు లేఖలో పేర్కొన్నారు.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి భారతదేశంలోని అన్నీ నగరాలు, పట్టణాలు, గ్రామాలలో సూక్ష్మ ఇంకా చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేస్తుంది అని అమెజాన్ ప్రతిజ్ఞ చేస్తూ ఏటా 10 బిలియన్ డాలర్ల భారతీయ నిర్మిత ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ఇంకా 2025 నాటికి ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది అని అన్నారు.

ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు భారత్‌ పర్యటనలో ఆయన వివరించారు. గత ఆరేళ్లుగా భారత్‌లో పెట్టుబడులతో కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమని బెజోస్‌ పేర్కొన్నారు.  

click me!