టెలికాం దిగ్గజం వోడాఫోన్ రూ .499 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ అన్నీ ప్రధాన సర్కిల్‌లలో లభిస్తుంది.
టెలికాం దిగ్గజం వోడాఫోన్ తమ కస్టమర్ల కోసం ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ .499, ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 1.5 జీబీ డేటా ఇస్తుంది. ఇంకా ఈ ప్లాన్ అన్ని ప్రధాన సర్కిల్‌లలో లభిస్తుంది. వోడాఫోన్ ప్రస్తుతం ఉన్న రూ. 555 రూపాయల ప్రీపెయిడ్ ప్లాను కూడా మార్చింది.
also read స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ రియల్ మి డేస్ సేల్ ఆకర్షణీయమైన ఆఫర్లు...
రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ రూ .555 ప్లాన్‌కు బదులుగా ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇది రోజుకు 1.54 జిబి డేటా, ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తుంది.ఈ ప్లాన్ ద్వారా జీ5 స్ట్రీమింగ్ యాప్, వోడాఫోన్ ప్లేలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. సర్కిల్‌ని బట్టి 70 నుంచి 60 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ వస్తుంది.
రూ.555 ప్లాన్ లో కొన్ని మార్పులు చేశారు. దీని వాలిడిటీని కూడా తగ్గించారు. 77 రోజులు ఉండాల్సిన వాలిడిటీని 70 రోజులకు తగ్గించారు. 555 ప్లాన్‌లో రోజుకు 1.5 జిబి డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎమ్‌ఎస్‌ఎమ్‌లతో వస్తుంది. పైన ఉన్న రెండు ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవలంటే మీరు రూ .997 ను ఎంచుకోవాలి.
ఇది వోడాఫోన్ దీర్ఘకాలిక ప్లాన్. ఇందులో ఇది 180 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది. అలాగే రోజుకు 100 SMS లతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది.రూ .997 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఆరునెలల పాటు అసౌకర్యం లేకుండా ఉండటానికి వీలు కల్పిస్తుంది.
also read పేటీఎం పేరుతో చీటింగ్... కస్టమర్ల డేటా లీక్...
వోడాఫోన్ వార్షిక ప్రణాళిక కంటే ఇది చాలా తక్కువ. మీరు 997 ప్లాన్‌ను ఎంచుకుంటే సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే మీ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి.అయితే మీరు 365 రోజులు వాలిడిటీ ప్లాన్ కోసం రూ .2399 ప్లాన్ ఉంది. ఇది 1.5 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో వస్తుంది.
ఈ ప్లాన్ 365 రోజులు వాలిడిటీ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో మీ ఫోన్‌ను రీఛార్జ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి నెల తర్వాత మీ ప్జోన్ రిచార్జ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫోన్‌ను ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిఓతుంది.వోడాఫోన్ చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 2019 లో ధరల పెరుగుదల తరువాత ఉన్న కొన్ని ప్లాన్‌లను మార్చింది. అవి ఎయిర్‌టెల్, జియోతో పాటు మెరుగైన ఆదాయాన్ని సంపాదించడానికి వారి ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి.