‘వొడాఫోన్ ఐడియా’ పోస్ట్​పెయిడ్ సర్వీసు పేరు మార్పు...

By Sandra Ashok Kumar  |  First Published Feb 7, 2020, 11:18 AM IST

వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ పోస్ట్ పెయిడ్​​ సర్వీసు పేరుకు మార్పులు చేసింది. ఇక నుంచి బ్రాండ్​ పేరు నుంచి ఐడియా పదాన్ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్​ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియాగా వేర్వేరు పేర్లతోనే కొనసాగుతాయని పేర్కొంది.
 


న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం సంస్థ వొడాపోన్​-ఐడియా తమ సర్వీసుల విషయమై కీలక నిర్ణయం తీసుకున్నది. తమ పోస్ట్​పెయిడ్ సర్వీసుకు పేరు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఐడియా అనే పదాన్ని తమ బ్రాండ్​ నేమ్​ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. 

also read ఫేస్ బుక్ వల్ల మీ ఉద్యోగానికి ఎసరు...జాగ్రత్త...

Latest Videos

ఇక నుంచి వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ‘రెడ్’ అనే పేరుతో సేవలు పొందాల్సి ఉంటుంది. ప్రీ-పెయిడ్ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియా పేర్లతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

దీనికి ప్రత్యామ్నాయంగా వొడాఫోన్-ఐడియా పోస్ట్​పెయిడ్​ వినియోగ దారులందరికీ 'వొడాఫోన్​ రెడ్​ ప్లాన్'​ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.  వొడాఫోన్, ఐడియా బ్రాండ్స్ సేల్స్, డిజిటల్ చానెల్స్ షాపుల్లో ఇక వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్’ పథకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

ఐడియా బ్రాండ్ కింద పోస్ట్ పెయిడ్ సేవలు అందుకుంటున్న వారు ఇక వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ పథకంలోకి మారాల్సి ఉంటుంది. కొత్తగా చేరే వినియోగదారులకు నేరుగా వొడాఫోన్​ రెడ్​ ప్లాన్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత కస్టమర్లు ఆటోమేటిక్​గా ఈ ప్లాన్​కు మారతారని పేర్కొంది.

also read స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై కరోనా వైరస్ ఎఫెక్ట్...

వొడాఫోన్​, ఐడియా సెల్యులార్​లు 2018లోనే విలీనమై వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​గా మారింది. కంపెనీ ప్రణాళికలో భాగంగానే వొడాఫోన్​ రెడ్​ ప్లాన్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించిందీ వ్యాపార సంస్థ.
 

click me!