ఆన్ లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డాటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...

By Sandra Ashok Kumar  |  First Published Mar 16, 2020, 3:47 PM IST

కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, నేషనల్), మొత్తం 6GB డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్‌ఎం‌ఎస్ లు అందిస్తుంది.


వోడాఫోన్ భారతదేశంలో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.  ప్రస్తుతం ఎంచుకున్న సర్కిల్‌లలో 248 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఆక్టివ్ గా ఉన్నాయి. ఈ ప్యాక్‌ 28 రోజుల వాలిడిటీతో ఆన్ లిమిటెడ్ కాల్స్  అందిస్తుంది.

యాడ్-ఆన్‌లలో దాని వినియోగదారుల కోసం జీ5, వోడాఫోన్ ప్లే సబ్స్క్రిప్షన్   ఫ్రీగా ఆక్సెస్ చేసుకోవచ్చు. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్ ఢిల్లీ, హర్యానా సర్కిల్‌లలో ప్రస్తుతానికి మాత్రమే అందుబాటులో  ఉంది.  కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా మై వోడాఫోన్ యాప్ ద్వారా  రీఛార్జ్ చేసుకోవచ్చు.  

Latest Videos

also read సెల్ ఫోన్లపై జీఎస్టీ పెంపు:మేకిన్ ఇండియాకు కష్టమేనంటున్న ఇండస్ట్రీ

కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, నేషనల్), మొత్తం 6GB డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్‌ఎం‌ఎస్ లు అందిస్తుంది. ఈ ప్యాక్  ద్వారా వొడాఫోన్ ప్లే (రూ. 499 ధర), జీ5 (రూ. 999) కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్  అందిస్తుంది.

కొత్త వోడాఫోన్ మరోవైపు రూ. 248 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో ఆన్ లిమిటెడ్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కుకైనా లోకల్ + నేషనల్), మొత్తం 8 జిబి డేటా, 100 లోకల్,  నేషనల్ ఎస్ఎంఎస్ లు అందిస్తుంది. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ కింద జీ5, వొడాఫోన్ ప్లే సబ్స్క్రిప్షన్  కూడా అందిస్తుంది. ఈ ప్యాక్‌లు ప్రస్తుతం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే అందుబాటులో ఉంది.  

also read షాక్: ఆన్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డుల లావాదేవీలకు చెక్

డబుల్ డేటా ఆఫర్ గురించి మాట్లాడుతూ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు మొత్తం 3 జిబి హై-స్పీడ్ డేటా 28 రోజులు వాలిడిటీ ఉంటుంది. రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల పాటు 3 జీబీ హై-స్పీడ్ డైలీ డేటాను ఇస్తుంది. రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5జి‌బి అదనపు హై స్పీడ్ డేటాను 84 రోజులు పొందవచ్చు.

click me!