ఎయిర్‌టెల్‌, జియోకు పోటీగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసిన ‘వీఐ’

By Sandra Ashok Kumar  |  First Published Sep 14, 2020, 6:13 PM IST

 కొత్త బ్రాండ్ లోగోను ప్రారంభించిన తర్వాత మొదటి యాడ్-ఆన్ ప్లాన్. రూ.351 ధరతో  వి‌ఐ హోమ్ ప్లాన్ పరిచయం చేసింది. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోకు పోటీగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్లాన్‌ను ఆవిష్కరించింది.


భారతదేశ టెలికాం వోడాఫోన్ ఐడియా తాజాగా వి‌ఐగా రిబ్రాండ్ గా మారిన తరువాత  వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికోసం కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇది కొత్త బ్రాండ్ లోగోను ప్రారంభించిన తర్వాత మొదటి యాడ్-ఆన్ ప్లాన్. రూ.351 ధరతో  వి‌ఐ హోమ్ ప్లాన్ పరిచయం చేసింది.

ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోకు పోటీగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ  కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌  కొన్ని  సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తున్నది. 

Latest Videos

undefined

రూ.351 ప్లాన్ వినియోగదారుకు 56 రోజుల వాలిడిటీతో 100జి‌బి డేటాను అందిస్తుంది. ఈ కొత్త ప్లాన్‌ను వీఐ వెబ్‌సైట్‌లోని యాడ్‌ ఆన్‌ సెక్షన్‌లో చూడొచ్చు.

also read టెలివిజన్ల ధరలు పెరగనున్నాయా.. రాయితీని పొడిగించకపోతే తప్పదంటున్న కంపెనీలు.. ...

అంతేకాదు తక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం కంపెనీ 28 రోజుల వాలిడిటీతో, 3 జిబి అందించే రూ.48 ప్లాన్ కూడా అందిస్తోంది. అతిచిన్న డేటా యాడ్-ఆన్ ప్యాక్ ధర రూ.16 ఇది 24 గంటల పాటు 1జి‌బి డేటాను అందిస్తుంది.

దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం కంపెనీల మధ్య విలీన ఒప్పందం జరిగిన రెండు సంవత్సరాల తరువాత వోడాఫోన్ ఐడియా చివరకు వి‌ఐగా బ్రాండ్ చేయబడింది.  వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకపై  వీఐగా పిలువనున్నట్లు  ప్రకటించిన   కంపెనీ  నూతన బ్రాండ్‌తో మార్పు దిశగా అడుగులు వేస్తున్నది.  

click me!