అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా

By Sandra Ashok Kumar  |  First Published Sep 14, 2020, 5:25 PM IST

పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ లో పనిచేయడానికి కూడా నిమాయకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ - జూన్ మధ్య రికార్డు లాభం, ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది, ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో కిరాణా, ఇతర సామాగ్రిని కొనడానికి ఎక్కువ మంది అమెజాన్ ఆశ్రయించారు అని తెలిపింది.


ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ కారణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 1 లక్ష మందిని నియామించుకొనున్నట్లు ప్రకటించింది. కొత్త నియామకాలను ప్యాకింగ్, షిప్పింగ్ లేదా ఆర్డర్లను క్రమబద్ధీకరించడానికి ఉపయోగించుకుంటామని పేర్కొంది.

పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ లో పనిచేయడానికి కూడా నిమాయకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ - జూన్ మధ్య రికార్డు లాభం, ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది, ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో కిరాణా, ఇతర సామాగ్రిని కొనడానికి ఎక్కువ మంది అమెజాన్ ఆశ్రయించారు అని తెలిపింది.

Latest Videos

undefined

ఆర్డర్‌ల రద్దీ వల్ల కంపెనీ ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో 1,75,000 మందిని నియమించుకోవలసి వచ్చింది. అమెజాన్ ఈ నెలలో ప్రారంభిస్తున్న 100 కొత్త వేర్ హౌస్, ప్యాకేజీ సార్టింగ్ కేంద్రాలు, ఇతర ప్రదేశాలలో కొత్త నియమకాలు అవసరమని తెలిపింది.

also read మ్యూజిక్ యాప్ సపోర్ట్ తో బోస్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే ? ...

అమెజాన్ వేర్ హౌస్ లను పర్యవేక్షించే అలిసియా బోలర్ డేవిస్ మాట్లాడుతూ "అదనంగా 100 డాలర్లు బోనస్‌లు ఇస్తామని ప్రకటించిన కార్మికులు మొగ్గు చూపడం లేదని డెవిస్ పేర్కొన్నారు. డెట్రాయిట్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, కెంటుకీలోని లూయిస్విల్లే వంటి నగరాలలో కార్మికలు కొరత ఉందని తెలిపింది.

అమెజాన్‌లో ప్రారంభ వేతనంగా గంటకు 15డాలర్లు ఇస్తునట్లు చెప్పారు. సెలవులలో ఎక్కువ మంది కార్మికులను నియమించాల్సిన అవసరం ఉందా అనే దాని పై అమెజాన్ యోచిస్తుంది, కానీ ఇంకా ఎలాంటి  ప్రకటన చేయలేదు అని బోలర్ డేవిస్ చెప్పారు.

గత సంవత్సరంలో సెలవులకు ముందు 2,00,000 మందిని అమెజాన్ నియమించుకుంది. సెలవులలో ప్యాకేజీలను డెలివరీ చేయడంలో సహాయపడటానికి 1,00,000 మందిని తీసుకురావాలని యుపిఎస్ గత వారం తెలిపింది.

click me!