వోడాఫోన్ ఐడియాకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు.. స్పందించాలంటూ ఆదేశం

By Sandra Ashok KumarFirst Published Aug 26, 2020, 5:49 PM IST
Highlights

అసలే అప్పుల సంక్షోభం, ఏజీఆర్ బకాయిలతో ఇబ్బందుల్లో వోడాఫోన్ ఐడియాకు ఈ నోటీసుతో గట్టి షాక్ తగిలింది. పిటిఐ ప్రకారం పారదర్శకత లేని రెడ్‌ఎక్స్  ప్లాన్ ఆఫర్ పై ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఆగస్టు 31 లోగా "కారణం చూపించమని" వోడాఫోన్ ఐడియాను కోరింది.

టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ వోడాఫోన్ ఐడియాకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. రెడ్ఎక్స్ టారిఫ్ ప్లాన్ ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలతో ట్రాయ్ ఈ‌ నోటీస్ జారీ చేసింది.

అసలే అప్పుల సంక్షోభం, ఏజీఆర్ బకాయిలతో ఇబ్బందుల్లో వోడాఫోన్ ఐడియాకు ఈ నోటీసుతో గట్టి షాక్ తగిలింది. పిటిఐ ప్రకారం పారదర్శకత లేని రెడ్‌ఎక్స్  ప్లాన్ ఆఫర్ పై ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఆగస్టు 31 లోగా "కారణం చూపించమని" వోడాఫోన్ ఐడియాను కోరింది.

"రెడ్‌ఎక్స్ టారిఫ్ ఆఫర్‌లో పారదర్శకత లేదని, తప్పుదారి పట్టించెల ఉందని టెలికాం టారిఫ్ ఆర్డర్, 1999 కింద ఉన్న టారిఫ్ అసెస్‌మెంట్ యొక్క రెగ్యులేటరీ సూత్రాలకు అనుగుణంగా లేదు" అని ట్రాయ్ షో-కాజ్ నోటీసులో పేర్కొంది.

also read స్మార్ట్‌ఫోన్ రంగంలోకి రీఎంట్రీ : బడ్జెట్ ధరకే జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ ...

వొడాఫోన్ ఐడియా ఇంటర్నెట్ స్పీడ్‌, ప్రియారిటీ క‌స్టమ‌ర్ కేర్ ఆఫర్లతో రెడ్ ఎక్స్ ప్లాన్లను అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఎయిర్‌టెల్ కూడా ప్లాటినం ప్లాన్ల‌తో త‌న పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు ప్రీమియం సేవ‌ల‌ను ఆఫర్ చేస్తోంది.

ట్రాయ్ గ‌తంలో కూడా ఈ విష‌యంపై వోడాఫోన్ ఐడియాతో పాటు ఎయిర్‌టెల్‌ ను ప్రశ్నించింది. అలాగే దీనికి సంబంధిత డేటాను అందించమని కోరింది. దీంతో ఎయిర్‌టెల్ ఆ ప్లాన్ల‌కు మార్పులు, చేర్పులు చేసింది.

అయితే వోడాఫోన్ ఐడియా మాత్రం ఈ ప్లాన్ కొత్తది కాదంటూ ప్రతికూలంగా స్పందించడంతో వివాదం ఏర్పడింది. వొడాఫోన్ ఐడియా స్టాక్ బుధవారం ట్రేడింగ్‌లో ఒక శాతానికి నష్టపోయి 8.94 డాలర్ల వద్ద ముగిసింది.

click me!