ఉద్యోగుల రక్షణగా రూం సానిటైజర్.. డీజిల్ లోకో షెడ్ కొత్త ఆవిష్కరణ..

Ashok Kumar   | Asianet News
Published : Aug 26, 2020, 03:51 PM IST
ఉద్యోగుల రక్షణగా రూం సానిటైజర్.. డీజిల్ లోకో షెడ్ కొత్త ఆవిష్కరణ..

సారాంశం

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ విపరీతంగా విహృంభిస్తుంది. ఆఫీసులు, కార్యాలయాలలో పని చేసే వారికి రక్షణగా డీజిల్ లోకో షెడ్ రూం సానిటైజర్ ని తయారు చేసింది.

వాల్టెయిర్ డివిజన్‌కు చెందిన డీజిల్ లోకో షెడ్ టీం మరో కొత్త పరికరాన్ని ఆవిష్కరిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ విపరీతంగా విహృంభిస్తుంది. ఆఫీసులు, కార్యాలయాలలో పని చేసే వారికి రక్షణగా డీజిల్ లోకో షెడ్ రూం సానిటైజర్ ని తయారు చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి డీజిల్ లోకో షెడ్ (డి‌ఎల్‌ఎస్) పెడల్ ఆపరేటెడ్ హ్యాండ్ వాష్ బేసిన్లు, హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్లు, పేపర్ / ఫైల్ శానిటైజర్లు, కరెన్సీ శానిటైజర్లు వంటి వివిధ పరికరాలను కనుగోన్నది. రైల్వే సిబ్బంది ఉపయోగం కోసం డీజిల్ లోకో షెడ్ హ్యాండ్ శానిటైజర్‌ను కూడా సిద్ధం చేసింది.

కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి రిమోట్ కంట్రోల్ ఆపరేటెడ్ యూ‌వి‌సి ఆధారిత రూమ్ శానిటైజర్‌ను డి‌ఎల్‌ఎస్ తాజాగా తయారుచేసింది. అవసరానికి అనుగుణంగా ఒక గది నుండి మరొక గదికి సులభంగా కదలడానికి దీనికి చక్రాలు కూడా అమర్చారు.

also read బడ్జెట్ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో నోకియా 3జి‌బి స్మార్ట్ ఫోన్.. ...

ఇండియాలో అభివృద్ది చేసిన ఈ పరికరం తక్కువ సమయంలోనే 400 చదరపు అడుగుల గదిని శుభ్రపరుస్తుంది. కేవలం 400 చదరపు అడుగుల పెద్ద గదిని 30 నిమిషాలలో, చిన్న గదిని 15 నిమిషాలలో శుభ్రం చేస్తుంది.

ఇది తాజా అల్ట్రావయొలెట్  జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ రేడియేషన్ ఫోటోడైమైరైజేషన్ ప్రక్రియ ద్వారా హానికలిగించే ఆర్‌ఎన్‌ఏ, డి‌ఎన్‌ఏలను బలంగా గ్రహిస్తుంది. దీనివల్ల వైరస్ అంతం అవుతుంది, అవి ఇకపై  వ్యాప్తి చెందవు. ఇలాంటి రెండు పరికరాలు ఇప్పటికే డి‌ఆర్‌ఎం కార్యాలయంలో, డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో వాడుతున్నారు కూడా.

వాల్టెయిర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ చేతన్ కుమార్ శ్రీవాస్తవ మార్గదర్శకత్వంలో దీనిని రూపొందించారు. శ్రీ ఎస్.కె. పాట్రో, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ (డీజిల్) పర్యవేక్షించారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదురుకొవటానికి ఇటువంటి పరికరాలను తయారు చేయడంలో డి‌ఎల్‌ఎస్ టీం ప్రశంసలు కూడా అందుకుంది.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?