చైనా యాప్స్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఒక్క యాప్ చాలు...

By Sandra Ashok Kumar  |  First Published Jun 2, 2020, 1:24 PM IST

చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆగ్రా రాజ్యాలతో మరణ మృదంగం మోగించింది.  దీంతో కరోనా వైరస్  గా  పేరొందిన  చైనా వైరస్ కారణంగా కొన్ని దేశాలు చైనాతో తెగదెంపులు చేసుకుంటున్నాయి. చైనా వస్తువులతో సహ చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయాలని చేస్తున్నాయి. 


ఇండియాలో చైనా ఉత్పత్తుల వినియోగం భారీగా విస్తరించింది. దీంతో భారతదేశంలో చైనా దిగుమతులకు డిమాండ్  కూడా పెరిగింది. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, విడిభాగాలు సహ అనేక ఇతర వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది.

ఆర్ధికవ్యవస్థతో అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆగ్రా రాజ్యాలతో మరణ మృదంగం మోగించింది.  దీంతో కరోనా వైరస్  గా  పేరొందిన  చైనా వైరస్ కారణంగా కొన్ని దేశాలు చైనాతో తెగదెంపులు చేసుకుంటున్నాయి. చైనా వస్తువులతో సహ చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయాలని చేస్తున్నాయి.

Latest Videos

undefined

చైనా మన దేశం కంటే ఎంతో కొంత ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం. ఈ క్రమంలో చైనాపై ఇండియాలో వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో వచ్చిన రిమూవ్ చైనా యాప్స్ (చైనా యాప్‌లను తొలగించే యాప్) యాప్‌కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.

కరోనా వైరస్ సోషల్ మీడియాలో ప్రజలు చైనాకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో రెండు వారాల కిందట జైపూర్‌లోని స్టార్టప్ కంపెనీ వన్ టచ్ యాప్ ల్యాబ్స్ ఈ కొత్త యాప్‌‌ని తయారుచేసింది. దీనికి ఒక్కసారిగా ప్రజాదరణ పెరిగింది.

also read ఫ్లిప్​కార్ట్ కు కేంద్రం షాక్..ఫుడ్ బిజినెస్ అనుమతికి కేంద్రం నిరాకరణ..

స్మార్ట్ మొబైల్‌లో రిమూవ్ చైనా యాప్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చైనా దేశానికి చెందిన యాప్స్‌ని గుర్తిస్తుంది. తద్వారా ఆ యాప్స్ మి స్మార్ట్ ఫోన్ నుండి  తొలగించాలా అని అడుగుతుంది. రెండు వారాల కిందట మే 17న లాంచ్ అయిన ఈ యాప్‌ని ఇప్పటికే 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

'రిమూవ్ చైనా యాప్స్' అనే యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ చాలా తక్కువగా 3.5 ఎం‌బి స్పేస్ మాత్రమే సరిపోతుంది. దీనిని ఇన్‌స్టాల్ చేశాక 'స్కాన్ నౌ' అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఈ యాప్‌లో బిన్ ఆప్షన్ నొక్కగానే మీ మొబైల్‌లోని చైనా యాప్స్ అన్నీ డిలీట్ లేదా అన్‌ఇన్‌స్టాల్ అవుతాయి.

ప్రస్తుతానికి ఈ యాప్‌కి గూగుల్ ప్లే స్టోర్ లో 4.8 రేటింగ్ ఉంది. త్వరలో దీన్ని యాపిల్‌కి చెందిన యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా చాలా మంది టిక్‌టాక్, షేర్‌ ఇట్, కామ్ స్కానర్ వంటి చైనా యాప్స్‌ని తొలగించుకుంటున్నారు. ప్రపంచంలో రష్యా, ఉత్తరకొరియా, చైనాలోనే అత్యధిక మంది అన్ ఎథికల్ హ్యాకర్లు ఉన్నారు.

అందువల్ల ప్రపంచంలోని చాలాస్మార్ట్ మొబైళ్లలో చైనా హ్యాకర్లు ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో వాడుతున్న చాలా మొబైళ్లకు చైనా హ్యాకర్ల సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి యాప్స్ వల్ల చైనాకి చెక్ పెట్టినట్లు అవుతుందని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ట్వీటర్ లో కూడా #BoycottChineseProducts అంటూ సాగుతున్న ట్రెండ్ లో కూడా ఈ యాప్ పేరు పొందింది. 

click me!