కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రూ.2 ప్రీపెయిడ్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ పెంచుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది.
కేంద్ర ప్రభుత్వ టెలికాం బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం ఒక కొత్త రూ.2 ప్రీపెయిడ్ ఆఫర్ ప్రవేశపెట్టింది. సాదారణంగా కొందరికి రీఛార్జి ప్లాన్ వాలిడిటీ అయిపోవడంతో ఒకోసారి ఇబ్బంది పడుతుంటారు. ఇందుకోసం బిఎస్‌ఎన్‌ఎల్ అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రూ.2 ప్రీపెయిడ్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీని వల్ల ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ పెంచుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. మీరు మీ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే ఆఖరి రోజున కేవలం రూ.2తో రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదనంగా మరో మూడు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
మీ గ్రేస్ పీరియడ్ మొదటి రోజున రూ.2 మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. అయితే ఈ రిచార్జ్ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ పెంపు తప్ప ఎలాంటి ఇతర లాభాలు ఉండవు.
also read అంతా ఫేక్: 11 అంకెల మొబైల్ నంబర్ ఊసే లేదు.. తేల్చేసిన ట్రాయ్
బీఎస్ఎన్ఎల్ అందించే రూ.19 ప్రీపెయిడ్ వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ రిచార్జ్ ప్యాక్ కు సవరణగా ఈ కొత్త ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ను మొదటగా ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ చేశారు. దీంతో మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీని 30 రోజుల పాటు పెంచుకోవచ్చు.
తాజాగా బీఎస్ఎన్ఎల్ ఒడిశా సర్కిల్ లో రూ.1,599, రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ వోచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రూ.1,599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు అన్ లిమిటెడ్ కాల్స్, రూ.1,500 టాక్ టైంను అందిస్తుంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 20 పైసలు చార్జ్ చేస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు వర్తిస్తుంది.
ఇక బీఎస్ఎన్ఎల్ రూ.899 రిచార్జ్ ప్లాన్ లాభాలు కూడా రూ.1,599 ప్లాన్ లాగానే ఉండనున్నాయి. కాకపోతే టాక్ టైం, వ్యాలిడిటీ కాస్త తగ్గుతుంది. ఈ ప్లాన్ ద్వారా కూడా రోజుకు 2 జీబీ డేటా, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. టాక్ టైం బ్యాలెన్స్ రూ.100, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేస్తే నిమిషానికి 20 పైసలు చార్జీ చేయనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.