పుకార్లు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు టిక్‌టాక్ మరో కీలక నిర్ణయం..

By Sandra Ashok KumarFirst Published Aug 19, 2020, 4:05 PM IST
Highlights

టిక్‌టాక్ పై యుఎస్ ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న టిక్‌టాక్ అన్ని లావాదేవీలను నిషేధిస్తు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసింది. 

చైనా యాప్ టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్ గురించి “పుకార్లు, తప్పుడు సమాచారలను” పరిష్కరించడానికి కొత్త ఇన్ఫర్మేషన్ హబ్, ట్విట్టర్ ఖాతాను టిక్‌టాక్ ప్రారంభించింది. టిక్‌టాక్ పై యుఎస్ ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న టిక్‌టాక్ అన్ని లావాదేవీలను నిషేధిస్తు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసింది, ఇది 45 రోజుల తరువాత (ఇప్పటికే 90 రోజులకు పొడిగించింది) అమలులోకి వస్తుంది అని తెలిపారు.

also read 

చైనా ప్రభుత్వంతో వ్యక్తిగత డేటాను పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న  టిక్‌టాక్‌ యాప్ వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా, టిక్ టాక్ వ్యాపారాన్ని ఏదైనా ఒక అమెరికన్ కంపెనీకి అమ్మాలని అమెరికా ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అమెరికా ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండించిన టిక్‌టాక్ ఒక  వెబ్‌సైట్‌  (www.tiktokus.info)ను, @tiktok_comms  పేరుతో ట్విటర్ అకౌంట్ ను ఏర్పాటు చేసింది.

వీటి ద్వారా టిక్‌టాక్ సంబంధించిన వాస్తవ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే సంబంధిత వార్తలకు వెంటనే స్పందించే ఉద్దేశ్యంతో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.  గత నెలలో ఇండియా 59 చైనా యాప్స్ ని నిషేదించిన విషయం మీకు తెలిసిందే. 

click me!