అమెజాన్, ఫ్లిప్‌కార్టులో ఎక్కువగా ఏం కొంటున్నారో తెలుసా..?

By Sandra Ashok Kumar  |  First Published Aug 18, 2020, 7:13 PM IST

 ఇ-కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు వారు పెద్ద మొత్తంలో విక్రయించిన ఉత్పత్తులను వివరాలను వెల్లడించాయి. సేల్స్ సమయంలో కొనుగోలు చేసిన టాప్ ఉత్పత్తులలో పవర్ బ్యాంకులు, ట్రిమ్మర్లు, స్టోరేజ్ ఉత్పత్తులు ఎక్కువగా  ఉన్నాయి అని తెలిపింది. 


దేశంలోని ఈకామర్స్ దిగ్గజాలు  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల ప్రారంభంలో మెగా సేల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే, అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపు, బెస్ట్ డిల్స్ కూడా అందించాయి. ఇ-కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు వారు పెద్ద మొత్తంలో విక్రయించిన ఉత్పత్తులను వివరాలను వెల్లడించాయి.

సేల్స్ సమయంలో కొనుగోలు చేసిన టాప్ ఉత్పత్తులలో పవర్ బ్యాంకులు, ట్రిమ్మర్లు, స్టోరేజ్ ఉత్పత్తులు ఎక్కువగా  ఉన్నాయి అని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ తన ఫ్రీడమ్ సేల్ సమయంలో 100 కిలోమీటర్లకు 1,000 ఎలక్ట్రిక్ కార్లకు శక్తినిచ్చేంత పవర్ బ్యాంకులను విక్రయించగలిగింది.

Latest Videos

undefined

థియేటర్లు మూసివేసినందున అమెజాన్ ఫైర్ టివి స్టిక్ సేల్స్ భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం అమెజాన్  ప్రైమ్ డే మొదటి రోజున వినియోగదారులు ఎక్కువగా ఫైర్ టివి స్టిక్ డివైజెస్ కొనుగోలు చేశారని ఇ-టైలర్ అమెజాన్  తెలిపింది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఐటి పరికరాలు, పవర్ బ్యాంకులు, స్టోరేజ్ డివైజెస్  అలాగే ఎడ్యుకేషన్ సంబంధిత ఉత్పత్తులలో సేల్స్ వృద్ధిని చూడగలిగామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ట్రిమ్మర్ల సేల్స్ కూడా భారీగా పెరిగాయి, స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్ లో ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రిమ్మర్ అమ్ముపోయిందని ఫ్లిప్‌కార్ట్ చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్స్, ఛార్జర్‌లకు కూడా అధిక డిమాండ్ పెరిగింది, వినియోగదారులకు విక్రయించిన అన్ని ఉత్పత్తులతో మొత్తం 3,250 ఛార్జింగ్ గంటలు అని ఫ్లిప్‌కార్ట్ చెప్పారు.

also read 

ఫ్లిప్‌కార్ట్ వారంటీ, వాల్యూ-ఆధారిత సర్వీసెస్ ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా పెరుగుదల కనిపించింది. కొత్తగా ప్రారంభించిన ల్యాప్‌టాప్‌లు 120 సెకన్లలోనే అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ రౌటర్లకు కూడా అధిక డిమాండ్ కనిపించింది. ఇంకా స్మార్ట్ వెరబుల్, హార్డ్ డిస్కుల వంటి డేటా స్టోరేజ్ ఉత్పత్తుల అమ్మకాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలిపింది.

1.5 మిలియన్ 4కె సినిమాలను స్టోరేజ్ చేయడానికి సరిపడా మొత్తం డివైజెస్ అమ్మినట్లు  ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది. అమెజాన్ ప్రైమ్ డే 2020 సందర్భంగా వినియోగదారులు మిలాగ్రో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్, స్మార్ట్ సేవర్ పల్స్ ఆక్సిమీటర్, ఒనిడా (హెచ్‌డిఎల్‌ఇడి టివి), బోట్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, హ్యాండ్ జ్యూసర్స్ వంటి ఉత్పత్తులను ఇష్టపడుతున్నారని కనుగొన్నారు.

ఇంకా, ప్రైమ్ డే మొదటి రోజు అమెజాన్ డివైజెస్ కు అతిపెద్ద రోజు అని కంపెనీ పేర్కొంది. ఎందుకంటే ఎకో పరికరాలు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్ల్ పరికరాలు పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. అలెక్సా వాయిస్ రిమోట్‌తో ఫైర్ టీవీ స్టిక్, ముఖ్యంగా ప్రైమ్ డేలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ డే 2020 మొదటి రోజున వినియోగదారులు ఎక్కువ ఫైర్ టివి స్టిక్ పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిపింది.
 

click me!