ఈ సమస్య సాధారణంగా భారతదేశంలోని యూసర్లకు ఉన్నట్లు నివేదించింది. కొత్త ఇన్‌స్టాలేషన్‌ల కోసం సేర్చ్ చేసే వారికి గూగుల్ పే లభించట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గూగుల్ పే ఇన్‌స్టాల్ చేసిన వారికి మాత్రం సెర్చ్ లో గూగుల్ పే చూపిస్తుంది.
న్యూ ఢీల్లీ: ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ గూగుల్ పే మనీ ట్రాన్స్ఫర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కనిపించట్లేదు అని కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ సమస్య సాధారణంగా భారతదేశంలోని యూసర్లకు ఉన్నట్లు నివేదించింది. కొత్త ఇన్‌స్టాలేషన్‌ల కోసం సేర్చ్ చేసే వారికి గూగుల్ పే లభించట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే గూగుల్ పే ఇన్‌స్టాల్ చేసిన వారికి మాత్రం సెర్చ్ లో గూగుల్ పే చూపిస్తుంది. కానీ సమస్య ఏమిటనేది గూగుల్ ఇంకా వెల్లడించలేదు. సమస్య ప్లే స్టోర్ మొబైల్ యాప్ లో ఉందా లేక ఇంకేదైనాన అని అర్ధం కావట్లేదు. యాప్ వెబ్‌సైట్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నివేదికలు నివేదించింది.
undefined
మీరు యాప్ ప్లే స్టోర్ లింక్ ద్వారా చూస్తే, అది ఈ దేశంలో అందుబాటులో లేదు అనే సమాచారం మీకు చుపిస్తుంది. ఈ సమస్య కొన్ని తెలియని కారణాల వల్ల కావొచ్చు అని తెలుస్తుంది, వ్యక్తిగత ఉపయోగం కోసం గూగుల్ పే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి అందుబాటులో లేదు అని తాజా నివేదికలు ఇప్పుడు ట్విట్టర్‌లో ఉన్నాయి.
also read
దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను చూస్తే, గూగుల్ పే యాప్ గూగుల్ ప్లే స్టోర్ కనిపించట్లేదు అని అర్ధమవుతుంది. ఈ యాప్ కోసం కొత్త అప్ డేట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్య అస్పష్టంగా ఉంది.
ఈ సమస్య గూగుల్ ప్లే స్టోర్ యాప్ లో మాత్రమే కనిపిస్తుంది, వెబ్ వెర్షన్ లో కాదు. వెబ్ బ్రౌజర్‌లో ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేయడం వల్ల మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఎటువంటి సమస్యలు లేకుండా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
గూగుల్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, కాబట్టి ప్రస్తుతానికి గూగుల్ అధికారిక పరిష్కారాన్ని అందించే వరకు వెబ్ బ్రౌజర్ ద్వారా ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేయడమే ఏకైక పరిష్కారం అని తెలుస్తుంది. అయితే ఈ సమస్య కొందరు ఇండియన్ యూసర్లకు మాత్రమే ఎదురైనట్లు వెల్లడించారు.