సోనీ కొత్త వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్ హెడ్‌ఫోన్స్...

By Sandra Ashok Kumar  |  First Published Feb 15, 2020, 2:59 PM IST

 సోనీ అద్బుతమైన ఫీచర్లతో నిండిన హెడ్‌ఫోన్‌లను కలిగి ఉంది. మొట్టమొదటి హెడ్‌సెట్ సోనీ డబల్యూ‌హెచ్-1000Xఎం3 మోడల్.  ఇది సోనీ కంపెనీ నుంచి వచ్చిన వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్  ప్రాడక్ట్.


మనలో చాలామంది సోనీ నుండి హై-ఎండ్ హెడ్‌ఫోన్‌ల గురించి ఆలోచించినప్పుడు, గుర్తుకు వచ్చే మొట్టమొదటి హెడ్‌సెట్ సోనీ డబల్యూ‌హెచ్-1000Xఎం3 మోడల్. ఇది సోనీ కంపెనీ నుంచి వచ్చిన వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్  ప్రాడక్ట్.

జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ అద్బుతమైన ఫీచర్లతో నిండిన హెడ్‌ఫోన్‌లను కలిగి ఉంది. వీటిలో ఒకటి H.Ear On సిరీస్, ఈ విభాగంలో కొత్త ప్రాడక్ట్ H.Ear On 3, సోనీ డబల్యూహెచ్-హెచ్910ఎన్ హెడ్‌ఫోన్‌లు ఈ రోజు అధికారికంగా అమ్మకాలను ప్రారంభించింది.

Latest Videos

also read ఆ స్మార్ట్ ఫోన్స్ కు భారీగా పడిపోయిన డిమాండ్...ఎందుకంటే...?

దీని ప్రస్తుత ధర రూ. 21,990, సోనీ డబల్యూహెచ్-హెచ్910ఎన్ సోనీ కంపెనీ మొదటి హెడ్‌ఫోన్‌లు, ఇవి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఈ ప్రాడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్ వేరియంట్ మాత్రమే ఇండియాలో అమ్మకానికి ఉంటుందని సోనీ కంపెనీ  తెలిపింది. ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్‌లో బ్లూటూత్ 5.0 ద్వారా వైర్‌లెస్ కనెక్టివిటీ, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్ ఉంటుంది.

ఎస్‌బి‌సి, ఏ‌ఏ‌సి, ఎల్‌డి‌ఏ‌సి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ ఉంది, ఎల్‌డి‌ఏ‌సి హై రిజల్యూషన్ గల వైర్‌లెస్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఫుల్ ఛార్జ్‌తో 35 గంటలు పనిచేస్తుందని అని సోని కంపెనీ క్లెయిమ్ చేయగా, యుఎస్‌బి అడాప్టర్‌తో 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే బ్యాటరీ 2.5 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు.

also read తక్షణం బకాయిలు చెల్లించండి.. లేదంటే!


మ్యూజిక్ ప్లేబ్యాక్, ఫోన్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్ ఫంక్షన్ల కోసం టచ్ కంట్రోల్స్ దీనికి  ఉన్నాయి. కుడి వైపు హెడ్‌ఫోన్‌కి  టచ్ సెన్సిటివ్ ప్యాడ్ ఉంటుంది. హెడ్‌ఫోన్‌లు 25 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉంటాయి.

ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ 5-40,000 హెర్ట్జ్, సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ఉపయోగించి కంట్రోల్ చేసుకోవచ్చు.నెక్స్ట్ జెనరేషన్  డబల్యూ‌హెచ్-1000Xఎం4 హెడ్‌ఫోన్‌లు త్వరలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

click me!