మీరు రెడ్‌మి ఫోన్లలో ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా లేదంటే..

By Sandra Ashok KumarFirst Published Nov 16, 2020, 2:24 PM IST
Highlights

సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి క్రాష్ అవుతుంటాయి. అయితే తాజాగా షియోమి రెడ్‌మి స్మార్ట్‌ఫోన్స్ లో ఎయిర్‌టెల్ సిమ్ కార్డుతో  ఫోన్ క్రాష్ అవుతోందని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. 

మీరు షియోమీ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ లో ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ క్రాష్ అవ్వోచు.. సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి క్రాష్ అవుతుంటాయి.

అయితే తాజాగా షియోమి రెడ్‌మి స్మార్ట్‌ఫోన్స్ లో ఎయిర్‌టెల్ సిమ్ కార్డుతో  ఫోన్ క్రాష్ అవుతోందని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎయిర్‌టెల్ సిమ్‌ను రెడ్‌మి ఫోన్‌లో ఉంచిన వెంటనే ఫోన్ రీ-స్టార్ట్ అవుతుందని వినియోగదారులు మండిపడుతున్నారు.

ఈ సమస్య తెరపైకి వచ్చిన తరువాత, సోషల్ మీడియాలో ప్రజలు షియోమి సంస్థపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షియోమి స్మార్ట్ ఫోన్స్ నుండే ఈ సమస్య ఉందని ఎయిర్‌టెల్ నుండి వచ్చిన ఒక ప్రకటనలో తెలిపింది.

also read కస్టమర్లను ఆకర్షించెందుకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే.. ...

ఎయిర్‌టెల్ యాప్‌లోని బగ్ కారణంగా రెడ్‌మి ఫోన్లు క్రాష్ అవుతున్నాయని చాలా మంది యూజర్లు పేర్కొన్నారు. పోకో ఫోన్లలో కూడా ఈ సమస్య వస్తోందని కొంత మంది యజుర్లు చెబుతున్నారు.  

ఈ సమస్య పై ఫిర్యాదు వెల్లువెత్తిన తరువాత, ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో షియోమి సంస్థ, ఎయిర్‌టెల్  రెండు ఈ సమస్య గురించి తెలుసుకున్నామని దీనిపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపింది.

ఈ సమస్య పరిష్కరించడానికి వినియోగదారులు సర్వీస్ సెంటర్ కూడా సందర్శించవచ్చని షియోమి తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రకారం, షియోమి త్వరలో ఈ సమస్యని పరిష్కరించడానికి కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయనుంది అని తెలిపింది, అయితే షియోమీ రెడ్‌మి, ఎయిర్‌టెల్  ఈ సమస్య ఎందుకు తలెత్తిందో కారణాలను స్పష్టంగా వెల్లడించలేదు.

 


MI redmi pro 9 max is getting rebooted in 5 seconds not enough window to un install the airtel app.
Tried all solution to reboot. Don't want to lose important data please suggest solution

— Nade Ali Vohra (@nadealivohra)

Airtel thanks app giving problem with redmi note 9 pro phone, why so?, Phone was continuously restarting, now uninstalled the app and phone works fine, kindly check and help out.

— Abhinav Kumar (@abby6191)


MI redmi pro 9 max is getting rebooted in 5 seconds not enough window to un install the airtel app.
Tried all solution to reboot. Don't want to lose important data please suggest solution

— Nade Ali Vohra (@nadealivohra)

Hi, we are sorry to know that you are facing an unexpected rebooting issue with your device. Please get in touch with us via DM by clicking on the below button and we will be able to help. https://t.co/052m7jGfJ8

— Mi India Support (@MiIndiaSupport)
click me!