దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్ లో ప్రజలు ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా..

By Sandra Ashok KumarFirst Published Nov 14, 2020, 3:44 PM IST
Highlights

 స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎంల లాంటి ఈ -కామర్స్ సంస్థలు  ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం కూడా దీపావళికి ముందు పండుగ సీజన్ సేల్ ఆన్ లైన్ షాపింగ్ జోరందుకుంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్ సమయంలో  ఆన్ లైన్ షాపింగ్ కి భలే డిమాండ్ ఉంటుంది. స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎంల లాంటి ఈ -కామర్స్ సంస్థలు  ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం కూడా దీపావళికి ముందు పండుగ సీజన్ సేల్ ఆన్ లైన్ షాపింగ్ జోరందుకుంది.

పండుగ సీజన్లో భారత ప్రజల షాపింగ్ అలవాటును అర్థం చేసుకోవడానికి స్నాప్‌డీల్ ఒక సర్వే నిర్వహించింది. దేశంలోని 92 నగరాలలో స్నాప్‌డీల్ 'కమ్ మే దమ్' దీపావళి సెల్‌ను ప్రవేశపెట్టింది, అయితే ఈ సేల్ త్వరలో ముగుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రజలు చేసిన కొనుగోళ్లపై కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది.

స్నాప్‌డీల్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం సేల్ లో ఇల్లు, వంటగది ఉత్పత్తులు అత్యంత ప్రాచుర్యం పొందాయి. 

ఏ నగర ప్రజలు ఎక్కువగా షాపింగ్ చేశారు?

-చండీఘడ్ లో అత్యధికంగా బీన్ బ్యాగ్స్ కొనుగోలు చేసారు.

-ఉత్తరాఖండ్ ప్రజలు ఎక్కువగా బార్బెక్యూ గ్రిల్స్ కొన్నారు. 
-మిక్సర్లు, ఛాపర్లు వంటి కిచెన్ సంబంధించి  వస్తువులు అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుండి ఆర్డర్ చేశారు.

-ప్రెజర్ కుక్కర్లు, 3 ఇన్ వన్ కుక్కర్లు, స్టీమర్లు వంటి కిచెన్ ఎసెన్షియల్స్ తమిళనాడులో గణనీయమైన సేల్స్  నమోదయ్యాయి.

 అత్యధిక సంఖ్యలో ఉపకరణాల కోసం ఆర్డర్లు గోవా నుండి వచ్చాయి. 

also read 

-ఢీల్లీలో అత్యంత సాధారణ దుస్తులు, టీ-షర్టులు, ట్రాక్ ప్యాంటు, షర్టులు మొదలైన వాటిని ఆర్డర్ చేశారు.

-తెలంగాణ ప్రజలు స్నాప్‌డీల్‌లో ఎక్కువ సన్‌ గ్లాసెస్ కొనుగోలు చేశారు.

 -బీహార్, పంజాబ్ మహిళలు చీరలు, చెప్పులు కోసం ఎక్కువగా ఆర్డర్ చేశారు. 

-సేల్ సమయంలో స్నాప్ డీల్ లో అత్యధికంగా అమ్ముడైన వస్తువు ఆభరణాలు, మహారాష్ట్రలో అత్యధికంగా మంగళసూత్రాలను కొనుగోలు చేశారు.

 -ఐరిస్, కోహ్ల్, ఐషాడోల కోసం అత్యధిక డిమాండ్ ఒరిస్సా నుండి వచ్చాయి, పశ్చిమ బెంగాల్ లో హెయిర్ డ్రయ్యర్లు, స్ట్రెయిట్నెర్లను కొనుగోలు చేసారు.
-పూల దుస్తులు, ప్రింటెడ్ జాకెట్లు, పూసల హారాలు ఆర్డర్లు అధికంగా మేఘాలయ  నుండి వచ్చాయి.
-ఎక్కువగా గడియారాలు అమ్ముడైన ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. 
-హర్యానాలో అత్యధికంగా జిమ్ పరికరాలను కొనుగోలు చేశారు. 

-కర్ణాటకలో అత్యధికంగా ఫిట్‌నెస్ బ్యాండ్లను కొనుగోలు చేశారు.

టెక్ & మొబైల్ ఉపకరణాల షాపింగ్
-కేరళలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వై-ఫై రౌటర్లను కొనుగోలు చేశారు.
-ఛత్తీస్‌ఘడ్ లో ఇయర్ ఫోన్స్, మొబైల్ ఫోన్ కవర్లు వంటివి అత్యధికంగా కొనుగోలు చేశారు.
-బెంగళూరులో చాలా ఆర్డర్లు అర్ధరాత్రి తరువాత వచ్చాయి. 
-ఢీల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం కారణంగా, రోగనిరోధక శక్తిని పెంచేవాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.
-పూణేలో పెంపుడు జంతువులకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోలు అత్యధికంగా ఉన్నాయి.

-పండుగ దుస్తుల షాపింగ్లో కోల్‌కతా ముందుంది. 
-ప్లే కార్డులు, పేకాట సెట్లు వంటి ఇండోర్ గేమ్స్ కోసం ఎక్కువగా ముంబైలో కొనుగోలు చేసారు.

click me!