ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ 5 సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తేస్తుంది. వాట్సాప్ యాప్ కోసం యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాల్‌లో మెరుగుదల ఇంకా కైఓఎస్ లో స్టేటస్ ఫీచర్‌తో సహా కొత్త ఫీచర్లను త్వరలోనే తిసుకురానున్నట్టు తాజాగా ప్రకటించింది.
ఎప్పటికప్పుడు అప్ డేట్ ఫీచర్లతో ముందుంటున్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ 5 సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తేస్తుంది.వాట్సాప్ యాప్ కోసం యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాల్‌లో మెరుగుదల ఇంకా కైఓఎస్ లో స్టేటస్ ఫీచర్‌తో సహా కొత్త ఫీచర్లను త్వరలోనే తిసుకురానున్నట్టు తాజాగా ప్రకటించింది.
ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే కొద్ది వారాల్లో ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ తెలిపింది. యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు వంటి ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
యానిమేటెడ్ స్టిక్కర్లు
టెలిగ్రామ్ యాప్ లో చాలా కాలంగా ఉన్న ఒక ఫీచర్ ఇప్పుడు వాట్సాప్‌లోకి కూడా రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ దాని స్వంత, థర్డ్ పార్టీ యాప్ నుండి స్టాటిక్ స్టిక్కర్లను ఉపయోగిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ నుండి యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వాట్సాప్ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.
క్యూఆర్ కొడ్స్
మీ ఖాతాను లింక్ చేయడానికి మీరు వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ కోసం క్యూఆర్ కోడ్‌ను ఎలా స్కాన్ చేస్తారో అదేవిధంగా, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా ఓ వ్యక్తిని మీ వాట్సాప్‌లో జోడించాలంటే వారి మొబైల్ నంబర్‌ను అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు. ఇకపై ఒక్క క్యూఆర్ కోడ్‌తో వారి నంబర్‌ను స్కాన్ చేసి, యాడ్ చేసుకోవచ్చు. ఈ లక్షణం కొంతకాలం స్నాప్‌చాట్‌లో ఉంది.
also read
వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ విడుదల చేసింది. అయితే, వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యాప్ ఇప్పటికీ ఈ ఫీచర్‌ను కలిగి లేదు. అయితే రాబోయే వారాల్లో డార్క్ మోడ్ థీమ్ కంప్యూటర్లకు వస్తుందని వాట్సాప్ తాజాగా ప్రకటించింది.
గ్రూప్ వీడియో కాల్ క్వాలిటి
ఏప్రిల్ నెలలో వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ పరిమితిని నాలుగు నుండి ఎనిమిది మంది వరకు పెంచింది. ఇప్పుడు ఇప్పుడు కాల్ క్వాలిటీపై దృష్టి సారించింది. దాంతోపాటు కాల్‌లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది. వాట్సాప్ ఎనిమిది లేదా అంతకంటే తక్కువ గ్రూప్ చాట్లలో వీడియో సింబల్ కూడా జోడిస్తోంది, కాబట్టి మీరు సులభంగా ఒక-ట్యాప్‌తో గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించవచ్చు.
కైఓఎస్కు స్టేటస్ ఫీచర్
గత సంవత్సరం, కైఓఎస్ ఫీచర్ ఫోన్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ వాట్సాప్‌కు సహకరించింది. అయినప్పటికీ, ప్రాసెసింగ్ పవర్, మెమరీ అడ్డంకి కారణంగా, స్టేటస్ తనంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. కాగా, దీన్ని ఇప్పుడు కైఓఎస్కు వాట్సాప్ విస్తరించనుంది.. కైఓఎస్ లోని వాట్సాప్ ఇప్పటి వరకు మెసేజింగ్, వాయిస్ నోట్స్ పంపడానికి సహకరిస్తుంది. అయితే తరువాత అప్ డేట్ లో కైయోస్‌లో స్టేటస్ ఫీచర్ వాట్సాప్‌కు జోడించబడుతుంది.