చైనా యాప్‌ల నిషేధంతో దేశీయ యాప్‌లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్‌చాట్, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్లోడ్స్ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్‌కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో వాటి వినియోగదారులు స్వదేశీ యాప్‌లవైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత షేర్‌చాట్, రొపొసొ, చింగారీ వంటి దేశీయ యాప్‌ల డౌన్లోడ్స్, సైనప్స్ భారీగా పెరిగాయి.
గత రెండు రోజుల్లో తమ యాప్ డౌన్‌లోడ్స్‌లో ఊహించని వృద్ధి నమోదైనట్లు దేశీయ అతిపెద్ద ప్రాంతీయ భాషా సోషల్ మీడియా వేదిక ‘షేర్‌చాట్’ వెల్లడించింది. చైనా యాప్‌లపై నిషేధం విధించినప్పటి నుంచి గంటకు 5 లక్షల మేర డౌన్లోడ్స్ అయ్యాయని, రెండు రోజుల్లో మొత్తం 1.5 కోట్ల మంది వినియోగదారులు పెరిగారని తెలిపింది.
undefined
‘షేర్‌చాట్‌కు ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఆదరణ భారతీయ సోషల్ మీడియా వేదికల్లో మేం అగ్రగామిగా నిలిచేలా చేస్తుంది. ఇది షేర్‌చాట్‌కు మరో విజయానికి పునాది వేస్తుందనే నమ్మకం ఉంది’ అని షేర్‌చాట్ సీఓఓ, సహ వ్యవస్థాపకుడు ఫరీద్ అహ్సాన్ చెప్పారు.
చైనా యాప్‌లను నిషేధించటంపై ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా పోస్టులు వచ్చాయని, వాటిని 10 లక్షల మందికి పైగా వినియోగదారులు లైక్ చేసినట్లు సంస్థ తెలిపింది. అందులో 5 లక్షలు వాట్సాప్‌లోకి షేర్ చేసినట్లు వెల్లడించింది.
also read
టిక్‌టాక్ వినియోగదారులు, అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నవారు.. నిషేధం తర్వాత తమ యాప్‌ను ఎంచుకుంటున్నట్లు షార్ట్ వీడియో యాప్ రొపొసొ తెలిపింది. టిక్‌టాక్‌లో 9.5, 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రేమ్ వాట్స్, నూర్ అఫ్సాన్ వంటి వారు తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని ప్రకటించింది.
రొపొసొ.. 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండగా.. 1.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. నెలకు 8 కోట్ల వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. చైనా యాప్‌లపై నిషేధం విధించిన 24 గంటల్లోనే 10 రెట్ల వృద్ధితో లక్షకుపైగా వినియోగదారులు పెరిగినట్లు బాక్స్ఎంగేజ్.కామ్ తెలిపింది.
లాక్డౌన్ విధించినప్పుడే బాక్స్ ఎంగేజ్ డాట్ కామ్ అనే బ్సైట్ను ప్రారంభించారు. సమాచార గోప్యత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతం వెబ్‌సైట్‌ను నడుపుతుండగా.. త్వరలోనే మొబైల్ యాప్‌ను తేనున్నట్లు ఈ సంస్థ పేర్కొన్నది.
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్‌కు ఆదరణ భారీగా పెరిగింది. 10 రోజుల్లో 5,50,000 డౌన్లోడ్స్ కాగా, మొత్తం డౌన్లోడ్స్ 20,50,000లకు చేరాయి.