జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్... ఇక దేశమంతా జియో ఫ్రీ..కాల్స్....

By Sandra Ashok Kumar  |  First Published Jan 9, 2020, 11:09 AM IST

భారతీ ఎయిర్ టెల్‌తో రిలయన్స్ జియో ప్రత్యక్ష పోరుకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ టెల్ వై-ఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తే జియో ఒక అడుగు ముందుకేసి దేశమంతా అమలులోకి తెచ్చింది.


ముంబై: ప్రముఖ టెలికం ప్రొవైడర్ సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు మరో శుభవార్త అందుబాటులోకి తీసుకొచ్చింది.  మరో టెలికం ప్రొవైడర్ సంస్థ ఎయిర్ టెల్ సంస్థకు పోటీగా వై-ఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో బుధవారం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని  తెలిపింది. 

also read యుసి బ్రౌజరులో కొత్త ఫీచర్...ఇక ఫొటోలు, వీడియోలు, నేరుగా.....

Latest Videos

కొద్ది రోజులుగా ట్రయల్స్ దశలో ఉన్న ఈ వసతిని జియో ప్రకటించింది. భారతదేశంలో ఉన్న ఏ వైఫై నెట్ వర్క్ లోనైనా ఈ సర్వీస్ పని చేయ నున్నది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది. వై-ఫై కాలింగ్ సేవలను ఉపయోగించుకుని వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చునని జియో తెలిపింది. 

ప్రసుత్తం 150 రకాల స్మార్ట్ ఫోన్లలో వైఫై ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే మీ స్మార్ట్ ఫోన్ లో వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు jio.com వెబ్ సైట్లో చూసుకోవచ్చు. జియో వైఫై కాలింగ్ ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. 

ఇంతకు ముందు కొన్ని రోజుల కిత్రం భారతీ ఎయిర్ టెల్  ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే  'ఎయిర్ టెల్ వైఫై కాలింగ్' పేరుతో సదుపాయాన్ని కల్పించింది. తాజాగా జియో మాత్రం ఉచిత వైఫై కాలింగ్ సదుపాయాన్ని భారతదేశం అంతటా కల్పించనున్నది.  జియో వై-ఫై కాలింగ్ సదుపాయం దాదాపు 150కి పైగా మోడల్ ఫోన్లలో పని చేస్తుండటం గమనార్హం.

also read మనుషుల్లాగే మాట్లాడే డిజిటల్​ మనుషులు... శామ్‌సంగ్ ల్యాబ్స్ సృష్టి

మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి ఈ వై-ఫై కాలింగ్ వసతి ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ అందుబాటులో లేనపపుడు దగ్గరలోని ఏ వై-ఫై నెట్ వర్క్‌కు కనెక్ట్ అయినా ఈ వసతిని ఉపయోగించుకోవచ్చునని జియో చెబుతోంది. అయితే మీ ఫోన్ లోని వై-ఫై సెట్టింగ్స్‌లో వై-ఫై కాలింగ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 
 

click me!