వాట్సాప్ త్వరలో వినియోగదారుల స్మార్ట్ ఫోన్ వాట్సాప్‌లలో యాడ్స్ ని తీసుకురాబోతుంది.ఇతర సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్ లాగా యాడ్స్ ని ప్రదర్శించాలనుకుంటుంది.ఈ సంవత్సరం వాట్సాప్ తీసుకురాబోయే ముఖ్య ఫీచర్లలో ఒకటి స్టేటస్ యాడ్స్.
భారత దేశంలో అత్యంత ఎక్కువ వినియోగదారులున్న ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సప్ ఇప్పుడు కొత్తగా యాడ్స్ ప్రవేశపెట్టబోతుంది. వాట్సాప్ త్వరలో వినియోగదారుల స్మార్ట్ ఫోన్ వాట్సాప్‌లలో యాడ్స్ ని తీసుకురాబోతుంది.వాట్సాప్ గత సంవత్సరం వినియోగదారుల కోసం అనేక నిఫ్టీ ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఫేస్ బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కొత్త సంవత్సరంలో ఇతర సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్ లాగా యాడ్స్ ని ప్రదర్శించాలనుకుంటుంది. ఇది వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురావాలని యోచిస్తోంది.
also read హానర్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్...128gb ఇంటర్నల్ స్టోరేజ్ తో...
ఈ సంవత్సరం వాట్సాప్ తీసుకురాబోయే ముఖ్య ఫీచర్లలో ఒకటి స్టేటస్ యాడ్స్. ఈ ఫీచర్ గురించి కంపెనీ ఇంతకు ముందే వెల్లడించింది.వాట్సాప్ యాడ్స్ పై నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సమ్మిట్ (ఎఫ్‌ఎంసి) 2019 లో కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఎఫ్‌ఎంసిలో ప్రకటనల గురించి మాట్లాడుతూ, ఈ యాడ్స్ లో వినియోగదారులకు అనుబంధ యాడ్స్ పాటు యాడ్ పేరును కూడా చూడగలరని కంపెనీ తెలిపింది.
వాట్సాప్ వినియోగదారులు స్వైప్ చేయడం ద్వారా యాడ్స్ చూడగలరాణి కంపెనీ వివరించింది. అంటే, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగా వాట్సాప్ స్టేటస్ ప్రకటనలు పని చేస్తాయి.స్టేటస్ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ యాడ్ ఫీచర్ ఆండ్రోయిడ్ మరియు ఐఓఎస్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది.
also read అన్నీ నెట్‌వర్క్‌లలో బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...
కొన్ని సంవత్సరాల క్రితం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ వాట్సాప్ స్టేటస్‌లో ఒక భాగమని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు ఎలా పనిచేస్తాయో అదేవిధంగా వాట్సాప్ యాడ్స్ ఫీచర్ పనిచేస్తుంది.
కొన్ని నెలల క్రితం దీనిపై ట్విట్టర్‌లో ఒక పోల్‌ను నిర్వహించింది, వారు “స్టేటస్ యాడ్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగిస్తారా?” అని వాట్సాప్ త్వరలో ప్రకటనలను తీసుకువస్తుందనే దానితో యూజర్లు సంతోషంగా లేరని పోల్ వెల్లడించింది. కొంతమంది వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌లో ప్రకటనలు ఉంటే వాట్సాప్‌ను ఆన్ ఇంస్టాల్ చేస్తాం అని చెప్పే స్థాయికి కూడా వెళ్లారు.