జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..

Ashok Kumar   | Asianet News
Published : Jun 13, 2020, 11:44 AM ISTUpdated : Jun 13, 2020, 10:12 PM IST
జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..

సారాంశం

సంచలనాల టెలికం ఆపరేటర్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. గోల్డ్, ఆ పై ప్లాన్ల వినియోగ దారులకు రూ. 999ల అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.    

ముంబై: అద్భుత ఆఫర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకర్షిస్తున్న టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’ తాజాగా తన జియో ఫైబర్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్టు జియో ప్రకటించింది.

జియో ఫైబర్ గోల్డ్ , ఆపైన ప్లాన్‌లో ఉన్న జియోఫైబర్ వినియోగ దారులకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్ తీసుకున్న వారికి ఈ ఉచిత అమెజాన్ ప్రైమ్ ఆఫర్ లభిస్తుంది. బ్రాంజ్, సిల్వర్ ప్లాన్ల సబ్ స్క్రైబర్లకు ఈ ఆఫర్ వర్తించదు. 

అంతే కాదు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్  బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన "గులాబో సితాబో' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్వాదించవచ్చు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ , బెంగాలీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, యాడ్ ఫ్రీ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్  సౌలభ్యం అందుబాటులోకి వస్తాయి.

రిలయన్స్ జియో ఫైబర్ పాత, కొత్త గోల్డ్ కస్టమర్లుకు ఈ ఆఫర్‌కు అర్హులు. అలాగే ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేయవచ్చు లేదంటే పాత ప్లాన్ లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

also read నోకియా కొత్త ఫీచర్ ఫోన్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు..

జియో ఫైబర్ గోల్డ్ లేదా పై ప్లాన్‌ను రీఛార్జ్  చేసుకోవాలి. మై జియో యాప్ లేదా జియో.కామ్ తో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి. ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ చేయాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సభ్యులుగా ఉన్న వారు తమ జియో సెట్ టాప్ బాక్సుల్లో సైన్ ఇన్ అయితే, సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 

జియోఫైబర్ గోల్డ్ ప్లాన్ ఆఫర్ కింద 250 ఎంబీపీఎస్ వేగంతో డేటా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రతి నెలకు 1,750 జీబీ డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్ అపరిమిత వాయిస్ కాలింగ్, అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ విత్ టీవీ వీడియో కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇతర జియో ఆప్ లకు అన్ లిమిటెడ్ యాక్సెస్ అవుతుంది.

జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్ ప్రకారం నెలకు రూ.1,299, డైమండ్ ప్లాన్ నెలకు రూ.2,499లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కూడా రూ.999, అంతకంటే ఎక్కువ కల ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !