ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ కి పోటీగా ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ...

By Sandra Ashok KumarFirst Published Jun 12, 2020, 8:58 PM IST
Highlights

ట్విట్టర్ "ఫ్లీట్స్" గా పిలువబడే "స్టోరీస్" భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇండియాలోని వినియోగదారులందరికీ ఫ్లీట్స్  వారి మొబైల్ యాప్ సరికొత్త వెర్షన్‌తో లభిస్తాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టోరీలగానే ఫ్లీట్‌లు 24 గంటల  మాత్రమే ఉంటాయి 

మైక్రో బ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే 'ట్విట్టర్ ఫ్లీట్' ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ స్టోరీస్  లాగే ఇప్పుడు ట్విట్టర్ లో కూడా స్టోరీస్ పెట్టుకోవచ్చు. ట్విట్టర్ ఫ్లీట్ కేవలం ఒక రోజు మాత్రమే ఉంటాయి.

మీరు పెట్టె ట్విట్టర్ ఫ్లీట్స్ మీ ఫాలోవర్స్ కి మాత్రమే కనిపిస్తాయి. మీకు నచ్చిన ఫోటోస్, షార్ట్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. ట్విట్టర్ "ఫ్లీట్స్" గా పిలువబడే "స్టోరీస్" భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రాబోయే రోజుల్లో ఇండియాలోని వినియోగదారులందరికీ ఫ్లీట్స్  వారి మొబైల్ యాప్ సరికొత్త వెర్షన్‌తో లభిస్తాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టోరీలగానే ఫ్లీట్‌లు 24 గంటల  మాత్రమే ఉంటాయి తర్వాత వినియోగదారుల టైమ్‌లైన్ నుండి డిలెట్ అవుతుంది.

also read కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో నగదు కొరత..ఈఎంఐ పేమెంట్లకే ప్రజల ప్రాధాన్యం

ట్వీట్ల లాగానే వాటిని లైక్స్ లేదా రీట్వీట్ చేయడం కుదరధు, కానీ ఇతర ఫాలోవర్స్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా ఫ్లీట్‌లకు రిప్లై చేయవచ్చు. తాజా ట్విట్టర్ ఫీచర్ మొట్టమొదట మార్చిలో బ్రెజిల్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా మంగళవారం భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఇఒస్  యూసర్లకు అందుబాటులోకి వచ్చింది. 

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స్టోరీలాగానే ఫ్లీట్‌ల ద్వారా మొబైల్ కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు కాకపోతే అవి అప్‌లోడ్ అయిన 24 గంటల తర్వాత ఎక్స్పైర్ . ఇవి అవుతాయి. ఫ్లీట్‌లు హోమ్ స్క్రీన్ పైభాగంలో లిమిటెడ్ సెకన్ల పాటు కనిపిస్తాయి. 

యూసర్ ప్రొఫైల్‌ ద్వారా ఇతర యూసర్ ఫ్లీట్‌లను చూడవచ్చు. యూజర్లు తమ ఫ్లీట్లను ఎవరు చూశారో కూడా చూడవచ్చు. భారతదేశంలోని ట్విట్టర్  యూసర్ ఫ్లీట్‌లను యాప్ ద్వారా మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు, చూడవచ్చు కాని వెబ్ లో మాత్రం చూడలేము. 

click me!