కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో నగదు కొరత..ఈఎంఐ పేమెంట్లకే ప్రజల ప్రాధాన్యం

By Sandra Ashok Kumar  |  First Published Jun 12, 2020, 12:33 PM IST

కరోనా ప్రభావంతో ప్రజానీకం వస్తువుల కొనుగోళ్లైనా, యుటిలిటీ సేవల చెల్లింపులైనా ఈఎంఐ పేమెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి క్రెడిట్ కార్డుపై ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయి.  


కోల్‌‌‌‌‌‌‌‌కతా: లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ నిబంధనలు సడలించినా.. ప్రజలు ఇంకా ఈఎంఐ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. తక్కువ విలువ గల ఉత్పత్తులను కూడా నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) ల్లోనే కొనుగోలు చేస్తున్నారు. 

రిటైలర్లు, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లలో ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయని, క్రెడిట్ కార్డుల మీద తీసుకునే ఫైనాన్సింగ్ పెరిగినట్టు బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు నివేదించాయి. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, మిక్సర్ గ్రైండర్లు, కిచెన్ సామాన్లు, స్పీకర్లు, హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, షూ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు తదితరాలు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కడుతున్నట్టు పేర్కొన్నారు.

Latest Videos

కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో ప్రజల వద్ద నగదు కొరత వచ్చింది. వేతనాల కోత, ఉద్యోగాలు పోతాయనే భయం వంటి కారణాలతో క్యాష్​ కొనుగోళ్లను ప్రజలు పక్కనపెడుతున్నారని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు చెప్పారు.

ప్రజలు క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌లను ఎంపిక చేసుకుంటున్నట్టు రిటైలర్లు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు చెప్పాయి. కార్డులపై ఇచ్చే ఫైనాన్స్​లు కరోనా కాలం ముందు నుంచి గత నెల వరకు 30–40 శాతం పెరిగినట్టు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు తెలిపారు.

ప్రస్తుతం కన్జూమర్ ఫైనాన్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల ఉనికి తగ్గడంతో, కార్డులపై ఇచ్చే ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌లు పెరిగాయి. కరోనా ముందు కాలం నుంచి క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డుల బిజినెస్‌‌‌‌‌‌‌‌లు మొత్తంగా 70 శాతం పెరిగినట్టు టాటా సన్స్ గ్రూపునకు చెందిన ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్ క్రోమా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రితేష్ ఘోసాల్ చెప్పారు.

ఇదే సమయంలో ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు ఆఫర్ చేసే పేపర్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌లు మూడో వంతు తగ్గిపోయినట్టు తెలిపారు. ఈ సమయంలో క్రెడిట్ కార్డుల ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లు పుంజుకున్నట్టు పేర్కొన్నారు. దేశంలో రెండు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ‌‌‌‌‌‌లు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్, అమెజాన్‌‌‌‌‌‌‌‌ కూడా ఫైనాన్సింగ్ ఆప్షన్లు పెరిగినట్టు చెప్పాయి.

డిజిటల్ పేమెంట్లను ప్రజలు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నారని ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ తెలిపింది. అమెజాన్‌‌‌‌‌‌‌‌ కూడా గత నెలలోనే అమెజాన్ పే లేటర్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.

also read రిలయన్స్ ఏజియో.కం బిగ్ బోల్డ్ సేల్‌ ఆఫర్..బిగ్ బ్రాండ్స్, బోల్డ్ డిస్కౌంట్స్..

అమెజాన్ వాయిదాల పద్దతిని ప్రారంభించినప్పటి నుంచి కన్జూమర్ అడాప్షన్‌‌‌‌‌‌‌‌లో ఆరింతల వృద్ధిని నమోదు చేసింది. ఎక్కువ ధర ఉన్న వస్తువుల కొనుగోలుకు అంతకుముందు క్రెడిట్‌‌‌‌‌‌‌‌ను వాడేవారు. కానీ ఇప్పుడు తక్కువ ధర ఉన్న వస్తువుల‌‌‌కు, నిత్యావసర వస్తువులకు  కూడా ఈఎంఐలనే వాడుతున్నట్టు అమెజాన్ పే అధికార ప్రతినిధి చెప్పారు.

యుటిలిటీ బిల్లుల చెల్లింపుకు కూడా ఈఎంఐ వాడుతున్నట్టు పేర్కొన్నారు. లైఫ్ స్టయిల్ రిటైలర్స్ అరవింద్ బ్రాండ్స్, పుమా, వుడ్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ వంటివి కూడా కార్డులపై ఈఎంఐలను ఆఫర్ చేస్తున్నాయి. వుడ్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ అంతకుముందు ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్ వాల్యు రూ.3 వేలుంటే ఈఎంఐ ఆఫర్ చేసేది. ఇప్పుడు దాన్ని రూ.2,500కి తగ్గించినట్టు ఎండీ హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిరాత్ సింగ్ తెలిపారు.

ప్రజలు మారటోరియానికి బదులు ఈఎంఐలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారని బ్యాంకు‌‌‌‌‌‌‌లు తెలిపాయి. మారటోరియం కాలంలో క్రెడిట్ కార్డుల ఔట్‌‌ ‌‌‌‌‌‌స్టాండింగ్‌‌‌‌‌‌‌‌పై 24–26 శాతం వడ్డీ రేటు వేసేందుకు ఆర్బీఐ క్రెడిట్ కార్డు కంపెనీలకు అనుమతిచ్చింది. దీంతో మారటోరియం ఎంపిక చేసుకోకుండా ఈఎంఐలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 

చాలా మంది క్రెడిట్ కార్డు కస్టమర్లు తమ నెలవారీ బిల్లులను 12–18 శాతం వడ్డీరేటుతో 6–24 నెలల ఈఎంఐలకు కన్వర్ట్ చేసుకుంటున్నట్టు ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు చెప్పారు. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లాంటివి డెబిట్ కార్డు లావాదేవీలపై కూడా ఈఎంఐలను ఆఫర్ చేస్తున్నాయి.

కన్జూమర్లు తక్కువ ధర ఉన్న ప్రొడక్ట్‌‌‌‌ లను కూడా ఈఎంఐల్లో కొనుగోలు చేసి, లాంగ్ టెన్యూర్‌‌‌‌‌‌‌‌ ఈఎంఐలను ఎంపిక చేసుకుంటున్నారని ఘోసాల్ తెలిపారు. ఈఎంఐ బేస్డ్ లోన్లకు, లావాదేవీలకు కరోనా తర్వాత కూడా బాగా డిమాండ్ వచ్చినట్టు కొటక్‌‌‌‌ మహింద్రా బ్యాంక్‌‌‌‌ కన్జూమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుజా చందనా అన్నారు. 

ఇంతకుముందుతో పోలిస్తే మరింత మంది కస్టమర్లు ఈఎంఐ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నట్టు విజయ్ సేల్స్, సంగీత మొబైల్స్, బిగ్‌‌‌‌సీ మొబైల్స్, గ్రేట్ ఈస్ట్రన్ రిటైల్ , కొహినూర్ వంటి రిటైలర్స్‌‌‌‌  చెప్పాయి. మొత్తం కార్డు స్వైప్‌‌‌‌ల్లో ఈఎంఐల కొనుగోలు అంతకుముందు 60 శాతం ఉండేవి.

ఇప్పుడు ఈఎంఐ పేమెంట్స్ 80 శాతానికి పైగా ఉన్నట్టు విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్తా తెలిపారు. చిన్న వస్తువుల ఫైనాన్సింగ్‌‌‌‌కు కూడా పెద్ద మొత్తంలో డిమాండ్ వస్తున్నట్టు కొహినూర్ సీఈవో విశాల్ మేవానీ చెప్పారు.

click me!