అండమాన్ దీవులలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4జి’ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 10, 2020, 4:36 PM IST

చెన్నై నుండి అండమాన్, నికోబార్ దీవులకు (CANI) అనుసంధానించే  2,312 కిలోమీటర్ల సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును 2018 డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేశారు.


అండమాన్ అండ్ నికోబార్ దీవులకు మొట్టమొదటిసారిగా సముద్రగర్భం నుండి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని వల్ల యూనియన్ టెరిటరిలో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందవచ్చు.

చెన్నై నుండి అండమాన్, నికోబార్ దీవులకు (CANI) అనుసంధానించే  2,312 కిలోమీటర్ల సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును 2018 డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేశారు.

Latest Videos

undefined

"చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, అక్కడి నుండి స్వరాజ్ ట్వీప్ వరకు ఈ సర్వీస్ అండమాన్ నికోబార్ లో నేడు  ప్రారంభమైంది" అని ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత చెప్పారు.

also read బెస్ట్ ఫీచర్స్ తో 20వేలలో లభించే స్మార్ట్ ఫోన్ ఏదో తెలుసా.. ...

"హిందూ మహాసముద్రం వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి వాణిజ్య, వ్యూహాత్మక పరాక్రమానికి కేంద్రంగా ఉంది. ఇండో-పసిఫిక్‌లో వాణిజ్యం, కొత్త విధానం, అభ్యాసాన్ని భారతదేశం అనుసరిస్తున్నందున అండమాన్ అండ్ నికోబార్‌తో సహా మన దీవులకు ప్రాముఖ్యత మరింత పెరిగింది,”అని ఆయన అన్నారు.

“దీనివల్ల ఆన్‌లైన్ క్లాసులు, టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్ లేదా టెలిమెడిసిన్ కు అండమాన్-నికోబార్‌లోని వేలాది కుటుంబాలు ఇప్పుడు అక్సెస్ పొందుతాయి. ఈ రోజు నుండి అండమాన్ వెళ్లే పర్యాటకులకు ఈ సౌకర్యం భారీ ప్రయోజనం లభిస్తుంది. ఈ రోజు ఏ పర్యాటక ప్రదేశానికైనా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ మొదటి ప్రాధాన్యతగా మారింది, ”అని అన్నారు.

ఫైబర్ లింక్ ప్రారంభించడంతో అండమాన్ అండ్ నికోబార్లలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4జి’ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ 4జి నెట్‌వర్క్‌ స్పీడ్  దీవులలో ఉండే వినియోగదారులకు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాన్ని అందిస్తాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

click me!