టిక్‌టాక్ పై ట్విటర్ కన్ను.. మరి సిల్వర్ లేక్ సాయపడుతుందా ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 10, 2020, 1:49 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాలను విక్రయానికి బైట్‌డాన్స్ కు  45 రోజుల డెడ్ లైన్ విధించింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనేందుకు  అమెరికా అధ్యక్షుడితో పాటు టిక్‌టాక్  తో సంప్రదింపులు చేస్తున్న విష్యం తెలిసిందే.


ప్రముఖ షార్ట్ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్  యు.ఎస్. కార్యకలాపాలను కొనేందుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇంక్ బైట్‌డాన్స్‌ను సంప్రదించింది, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ, ఈ ఒప్పందం కోసం ఫైనాన్సింగ్‌ను సమకూర్చుకునేందుకు ట్విట్టర్ సామర్థ్యంపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాలను విక్రయానికి బైట్‌డాన్స్ కు  45 రోజుల డెడ్ లైన్ విధించింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనేందుకు  అమెరికా అధ్యక్షుడితో పాటు టిక్‌టాక్  తో సంప్రదింపులు చేస్తున్న విష్యం తెలిసిందే. ట్విట్టర్ టిక్‌టాక్ కార్యకలాపాలను కొనేందుకు ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

Latest Videos

undefined

మరోవైపు మైక్రోసాఫ్ట్  సంస్థ యు.ఎస్. కార్యకలాపాల కోసం బిడ్డింగ్‌లో ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

also read 

ట్విట్టర్ 30 బిలియన్ డాలర్ల (23 బిలియన్ పౌండ్ల) మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది. టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాల కొనుగోలు కోసం నిధులు సమకూర్చడానికి అదనపు మూలధనాన్ని సమీకరించాల్సిన అవసరం ఉందని కొన్ని  వర్గాలు తెలిపాయి. 

"ఒకవేళ సిల్వర్ సంస్థ లేక్ ట్విటర్ కు తోడుగా నిలిస్తే మాత్రం అప్పుడు మైక్రోసాఫ్ట్ కి పోటీ రావచ్చునని అభిప్రాయపడ్డారు." అని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎరిక్ గోర్డాన్ అన్నారు. ట్విట్టర్  వాటాదారులలో ఒకరైన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్, ఈ ఒప్పందానికి నిధులు సమకూర్చడానికి ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.

టిక్‌టాక్, బైట్‌డాన్స్, ట్విట్టర్ దీనిపై మాట్లాడేందుకు నిరాకరించాయి. ఈ వారం ప్రారంభంలో, ట్రంప్ చైనాకు చెందిన మెసేజింగ్ యాప్ వీచాట్, టిక్‌టాక్ యజమానులతో యు.ఎస్ లావాదేవీలపై నిషేధాన్ని విధించారు.

click me!