అదిరిపోయే ఫిచర్లతో ఒప్పో ఎఫ్17ప్రో దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..

By Sandra Ashok KumarFirst Published Oct 20, 2020, 6:56 PM IST
Highlights

ఒప్పో సరికొత్త  ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ రంగులో ప్రవేశపెట్టారు. ఈ ఒప్పో మొబైల్ ఫోన్ బాక్స్‌లో 10000 mAh పవర్ బ్యాంక్ (18 W), దీపావళి ఎక్స్‌క్లూజివ్ బ్యాక్ కేస్ కవర్ కూడా అందిస్తుంది.

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త  ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ రంగులో ప్రవేశపెట్టారు. ఈ ఒప్పో మొబైల్ ఫోన్ బాక్స్‌లో 10000 mAh పవర్ బ్యాంక్ (18 W), దీపావళి ఎక్స్‌క్లూజివ్ బ్యాక్ కేస్ కవర్ కూడా అందిస్తుంది.

ఒప్పో ఎఫ్17ప్రో స్పెసిఫికేషన్స్:  సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే గురించి చెప్పాలంటే ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 కలర్‌ ఓఎస్ 7.2తో పనిచేస్తుంది. ఈ డ్యూయల్ నానో సిమ్ ఫోన్‌ 6.43 అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080 × 2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్ అండ్ స్టోరేజ్: ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి95 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో 1టి‌బి వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.

బ్యాటరీ సామర్థ్యం: ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో 4000 mAh బ్యాటరీని అందిచారు, 30 వాట్ల ఫ్లాష్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: ఫోన్‌లో 4జి వివోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అందించారు.

also read మొబైల్ డాటా త్వరగా అయిపోతుందా.. అయితే రిలయన్స్ జియో సూపర్ డాటా ప్లాన్స్ మీకోసమే.. ...

కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఇచ్చారు, ప్రాధమిక కెమెరా 48 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం రెండు ఫ్రంట్ కెమెరా సెన్సార్లు, ఒకటి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ అందించారు.

భారతదేశంలో ఒప్పో ఎఫ్17ప్రో దీపావళి ఎడిషన్ ధర
ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్ 8 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 23,990 రూపాయలు. కొత్త ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్ మాట్టే గోల్డ్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో బ్లూ అండ్ గోల్డ్ గ్రేడియంట్ ఫినిషింగ్ వేరియంట్ కూడా లభిస్తుంది.

ఈ ఒప్పో ఫోన్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది, అయితే సేల్స్ అక్టోబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ‌ఎం‌ఐ సౌకర్యంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుండగా, ప్రైమ్ కాని సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.

click me!