మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్‌ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ నోకియా బ్రాండ్ లైసెన్సు లండన్‌లో మార్చి 19న జరగబోయే కార్యక్రమంలో కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి నోకియా-బ్రాండెడ్ 5జి స్మార్ట్ ఫోన్ ప్రారంభమవుతుందని ఫిన్నిష్ కంపెనీ ప్రకటించింది.
ఇప్పటివరకు రాబోయే నోకియా 5జి ఫోన్ పేరు, ఇంటర్నల్ హార్డ్ వేర్ లేదా డిజైన్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.రాబోయే నోకియా 5జి స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతుంది అనే దానిపై 90 సెకన్ల వీడియోను మార్చి 8న విడుదల చేయనున్నారు.
also read మీ స్మార్ట్ ఫోన్ తో కరోనా వైరస్ కు చెక్...ఎలా అంటే ?
మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్‌ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ పై వచ్చిన లీక్‌లు, పుకార్ల ద్వారా చూస్తే, మార్చి 19న జరగబోయే ఈవెంట్ లో నోకియా 8.2 5జి, నోకియా 5.2 ‘కెప్టెన్ అమెరికా’, నోకియా 1.3, నోకియా సి2 ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేయనుంది.
also read జియో యూసర్లకు షాక్: డేటా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంపు....
5జి స్మార్ట్ ఫోన్‌లో నాలుగు కెమెరా లెన్స్‌లతో రేడియల్‌గా అమర్చబడిన కెమెరా మాడ్యూల్ ఇంకా మధ్యలో ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
డిజైన్, కలర్ టోన్ గత సంవత్సరం లాంచ్ చేసిన నోకియా 7.2 ను లాగా ఉండబోతుంది. నోకియా 5జి ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్, కింద భాగంలో నోకియా లోగో ఉండొచ్చు.