వొడాఫోన్ ఐడియాకు గుడ్ బై - రిలయన్స్ జియోకు వెల్‌కం

By Sandra Ashok KumarFirst Published Jan 28, 2020, 12:09 PM IST
Highlights

టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా వొడాఫోన్-ఐడియాను వీడుతున్న వినియోగదారులను ఆకర్షించి టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థగా 'జియో' ఎదిగినట్లు సర్వే అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య పరంగా గత ఏడాది నవంబర్​లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా సంస్థను వీడిన ఖాతాదారులను ఆకర్షించడంలో సఫలీకృతమైంది రిలయన్స్ జియో అని ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్ నివేదిక తెలిపింది. 

రెండేళ్లుగా వొడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు పేర్కొంది. టెలికం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' లెక్కల ప్రకారం 2019 నవంబర్​లో 36.9 కోట్ల మంది వినియోగదారులతో రిలయన్స్ జియో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. 

also read సాంసంగ్ నుండి కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్...

అదే నెలలో వొడాఫోన్-ఐడియా 33.62 కోట్లు, భారతీ ఎయిర్​టెల్​ 32.73 కోట్ల మంది వినియోగదారులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వినియోగదారుల సంఖ్యలో మాత్రమే కాకుండా మార్కెట్​ వాటాలోనూ జియో 34.9 శాతానికి ఎదిగి ప్రథమ స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది.

గత రెండు, మూడు త్రైమాసికాల నుంచి నష్టాల నుంచి తేరుకునేందుకు టెలికాం సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక అభిప్రాయ పడింది. ముఖ్యంగా ఇటీవల టెలికం సంస్థలన్నీ 25-35% వరకు పెంచిన టారిఫ్​లు ఇందుకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతకుముందు టెలికం సంస్థల నెలవారీ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) క్రమంగా పెరుగుతున్నట్లు గత రెండు, మూడు త్రైమాసికాల్లో నిర్ధారణ అయ్యింది.

also read ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!

2016లో రిలయన్స్ టెలికం రంగంలో ‘జియో’ పేరిట ప్రవేశించడంతోనే సంచలనాలు నెలకొల్పింది. నాడు కొన్ని ప్రైవేట్ టెలికం సంస్థలు వేరే సంస్థల్లో విలీనమయ్యాయి. భారతీ ఎయిర్ టెల్ సంస్థలో ఎయిర్ సెల్, టెలీనార్, టాటా టెలీ కమ్యూనికేషన్స్ సంస్థలు విలీనం అయ్యాయి.

బిర్లా గ్రూప్ సారథ్యంలోని ఐడియా సంస్థతో వొడాఫోన్ ఐడియా జత కట్టింది. దీంతో రెండున్నరేళ్ల క్రితం విలీనమైన వొడాఫోన్ ఐడియా సంస్థ దేశీయంగా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. కానీ రిలయన్స్ జియో అందిస్తున్న చౌక సేవలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా వొడాఫోన్ ఐడియా తన సబ్ స్క్రైబర్లను కోల్పోతుండగా, రిలయన్స్ జియో తన ఖాతాదారులను పెంచుకున్నది.

click me!