స్మార్ట్‌ఫోన్ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను భారతదేశం దాటేసి రెండో స్థానంలో స్థిర పడింది. చైనా తొలి స్థానంలో కొనసాగుతుండగా, తాజాగా అమెరికా మూడో స్థానానికి చేరిందని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ నివేదిక పేర్కొన్నది.
అంతర్జాతీయంగా భారత్ తొలిసారిగా స్మార్ట్ ఫోన్ల విపణిలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తరువాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిందని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తెలిపింది.2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. 2018తో పోలిస్తే ఇది 7 శాతం అధికం.
Also Read:ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!
భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో చైనా బ్రాండ్‌లు మరోసారి సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్ ఫోన్ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతకుముందు 2018లో ఇది 60 శాతానికి చేరుకున్నది.
చైనా దిగ్గజం షియోమీ 28శాతం మార్కెట్ షేర్‌తో మరోసారి అగ్ర స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత శామ్‌సంగ్ 21 శాతం, వివో 16 శాతం, రియల్‌మీ 10 శాతం, ఒప్పో 9 శాతం వాటా దక్కించుకున్నాయి.
Also Read:6న అమెరికాలో మోటో 'రేజర్' ఫోన్ ఆవిష్కరణ.. భారత్‌లో రిలీజ్‌పై అనిశ్చితి
2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా సంస్థ వివో రాణించింది. తొలిసారిగా శామ్‌సంగ్‌ను వెనక్కినెట్టి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో వివో మార్కెట్ వాటా 21 శాతం ఉండగా.. శామ్‌సంగ్ వాటా 19 శాతానికి పడిపోయింది. 27 శాతం వాటాతో షియోమి తొలి స్థానాన్ని దక్కించుకున్నది.