బిఎస్ఎన్ఎల్) ఇంతకుముందు 365 రోజుల వాలిడిటీ ఉన్న రూ. 1,188 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 300 రోజుల వాలిడిటీకి తగ్గించారు. రూ. 1,188 ప్రీపెయిడ్ ప్లాన్ ని "మారుతం" అని పిలుస్తారు.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇంతకుముందు 365 రోజుల వాలిడిటీ ఉన్న రూ. 1,188 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 300 రోజుల వాలిడిటీకి తగ్గించారు. రూ. 1,188 ప్రీపెయిడ్ ప్లాన్ ని "మారుతం" అని పిలుస్తారు. ప్రీపెయిడ్ ప్లాన్‌ను 21 జనవరి 2020 వరకు 365 రోజుల వాలిడిటీ అందించింది.
also read అమెరికా ఔట్.. స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో ఇండియా సెకండ్ ప్లేస్!
అయితే, బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త రిచార్జ్ ప్లాన్ మార్పులలో భాగంగా మార్చి 31 వరకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.రూ. 1,188 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అక్టోబర్ చివరి వరకు వాలిడిటీ ఉండేల ప్రమోషనల్ ఆఫర్ కింద గత ఏడాది జూలైలో దీనిని ప్రారంభించారు.
అదనపు కస్టమర్లను ఆకర్షించడానికి బిఎస్‌ఎన్‌ఎల్ జనవరి వరకు ఈ ఆఫర్‌ను పొడిగించారు.బిఎస్‌ఎన్‌ఎల్ తమిళనాడు వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం రూ. 1,188 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల వాలిడిటీకి మార్పు చేసింది .ఇది 365 రోజుల వాలిడిటీని 300 రోజులకు తగ్గించింది అంటే 65 రోజులు తక్కువ.
also read ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!
అధికారిక జాబితా ఈ ప్లాన్ ఇప్పటికీ ప్రోమోషనల్ ఆఫర్ క్రింద అందుబాటులో ఉందని, మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.టెలికాం-ఫోకస్డ్ బ్లాగ్ టెలికాం టాక్ మొదట ఈ ప్లాన్ పై సమాచారం అప్ డేట్ చేసింది.ఎక్కువ రోజుల వాలిడిటీ అందించడమే కాకుండా, బిఎస్ఎన్ఎల్ రూ. 1,188 "మారుతం" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను, 5 జిబి హై-స్పీడ్ డేటా, 1,200 ఎస్ఎంఎస్ లు అందిస్తుంది.
చెన్నై, తమిళనాడు సర్కిళ్లలో ఉన్న ప్రతి ఒక్క బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.బిఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్ సందర్భంగా రూ. 1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పై 71 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 15 మధ్య అందుబాటులో ఉంటుంది.