దేశంలో 10 శాతం పెరగనున్న మొబైల్ కాల్స్, డేటా రేట్లు..

By Sandra Ashok KumarFirst Published Sep 4, 2020, 5:42 PM IST
Highlights

 జాతీయ మీడియా నివేదికల ప్రకారం దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నాయి. టెలికం కంపెనీల మొత్తం రాబడిపై సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు ఇచ్చిన తరువాత కొత్తగా చార్జీల పెంపు చర్య వచ్చింది. 

ముంబై: వచ్చే మార్చి నాటికి దేశంలో మొబైల్ వాయిస్, డేటా సేవల రేట్లు 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నాయి.

టెలికం కంపెనీల మొత్తం రాబడిపై సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు ఇచ్చిన తరువాత కొత్తగా చార్జీల పెంపు చర్య వచ్చింది. టెలికాం కంపెనీల స్థూల రాబడి బకాయిలు చెల్లించడానికి సుప్రీం కోర్టు పదేళ్ల గడువు ఇచ్చింన సంగతి మీకు తెలిసిందే.

also read ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజితో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్... ...

అయితే బకాయిల్లో 10 శాతం మార్చి 31 లోపు చెల్లించాలని సూచించింది. దీని ప్రకారం భారతి ఎయిర్‌టెల్ రూ .2600 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .5000 కోట్లు చెల్లించాలి. గత డిసెంబర్‌లో దేశంలో కాల్ డేటా రేట్లు 40 శాతం పెరిగాయి.

వచ్చే పదేళ్లలో ఎజిఆర్ బకాయిల్లో ఎయిర్‌టెల్ రూ .43,989 కోట్లు,  వోడాఫోన్ ఐడియా రూ .58,254 కోట్లు చెల్లించాల్సి ఉంది. టాటా టెలిసర్వీసెస్ కూడా రూ.16,798 కోట్లు బాకీ ఉంది.

ఎజిఆర్ అంటే టెలికాం కంపెనీలు స్పెక్ట్రం వినియోగం, లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే మొత్తం అని అర్ధం. "రాబోయే 12-24 నెలల్లో టెలికాం సంస్థలు 200 రూపాయల ఏ‌ఆర్‌పి‌యూని చేరుకోవాల్సి ఉంటుందని మేము నమ్ముతున్నాము" అని రోహన్ ధమిజా అన్నారు.
 

click me!